https://oktelugu.com/

Most Sixes In IPL: ఐపీఎల్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ప్లేయర్లు వీరే

Most Sixes In IPL ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ క్రిస్ గేల్. ఇతను వెస్టిండీస్ మాజీ క్రికెటర్. మొత్తం 142 మ్యాచ్‌లలో 357 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇతను పంజాబ్ జట్టులో ఆడి సిక్స్‌లు కొట్టి మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.

Written By: , Updated On : March 30, 2025 / 12:10 PM IST
Most Sixes In IPL (1)

Most Sixes In IPL (1)

Follow us on

Most Sixes In IPL: పంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లీగ్ ఎప్పుడు వస్తుందని ఎందరో ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్ ప్రారంభం అయితే చాలు.. పనులు అన్ని కూడా పక్కన పెట్టి మరి మ్యాచ్‌లు చూస్తుంటారు. ఎందరో టాలెంటెండ్ ఉన్న ఆటగాళ్లు ఈ ఐపీఎల్ ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతారు. అయితే ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఇప్పటికి 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. మొత్తం 10 జట్లు ఈ ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడుతున్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎన్ని రికార్డులు ఉన్నాయి. ప్రతీ ఏడాది ఈ రికార్డులు అన్ని కూడా మారిపోతుంటాయి. ఆటగాళ్లు వస్తుంటారు.. రికార్డులను సృష్టిస్తుంటారు. అయితే ఐపీఎల్ మొత్తం సీజన్‌లో చూసుకుంటే ఎందరో బ్యాటర్లు ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా మిగతా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ ఫోర్లు, సిక్స్‌లు, వికెట్లు తీసిన వారు ఉన్నారు. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే మొత్తం ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఎక్కువగా సిక్స్‌లు కొట్టిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

క్రిస్ గేల్
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ క్రిస్ గేల్. ఇతను వెస్టిండీస్ మాజీ క్రికెటర్. మొత్తం 142 మ్యాచ్‌లలో 357 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇతను పంజాబ్ జట్టులో ఆడి సిక్స్‌లు కొట్టి మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.

రోహిత్ శర్మ
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారి జాబితాలో రోహిత్ శర్మ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ మొత్తం 257 మ్యాచ్‌లలో 280 సిక్స్‌లు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ జట్టు ఇప్పటి వరకు ఐదు సార్లు ట్రోఫీ గెలిచింది.

విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మొత్తం 252 మ్యాచ్‌లలో 272 సిక్స్‌లు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి అదే జట్టులోనే ఆడుతున్నారు. మొత్తం 18 సీజన్ల పాటు కోహ్లీ ఐపీఎల్‌లో ఒకే జట్టులో ఉన్నాడు.

ఎంఎస్ ధోని
క్రికెట్ గాడ్ ఎంఎస్ ధోని అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. మొత్తం 264 మ్యాచ్‌లలో 252 సిక్స్‌లు కొట్టాడు. ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే మధ్యలో సస్పెన్షన్ కారణంగా రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.

ఏబీ డెవిలియర్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో ఏబీ డెవిలియర్స్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇతను మొత్తం 184 మ్యాచ్‌లలో 251 సిక్స్‌లు కొట్టాడు.