https://oktelugu.com/

DC Vs RCB 2024: బెంగుళూర్ టీమ్ పరిస్థితి ఏంటి..? ఈ రోజు ఆడితే ఇక ఇంటికేనా..?

బెంగళూరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి అంటే బౌలింగ్.. వీళ్ళ బౌలర్లు బౌలింగ్ కనుక కాస్త మెరుగ్గా వేసినట్లయితే వీళ్ళను ఓడించే టీమ్ మరొకటి ఉండదనే చెప్పాలి. బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉన్న ఈ టీమ్ బౌలింగ్ కి వచ్చేసరికి మాత్రం కొంతవరకు తడబడుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 12, 2024 / 05:02 PM IST

    DC Vs RCB 2024

    Follow us on

    DC Vs RCB 2024: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరగనుంది. ఇక ఇప్పటికే బెంగళూరు టీం వరుసగా నాలుగు విజయాలను అందుకొని “ప్లే ఆఫ్” ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో కనుక గెలిస్తే ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన లేదా మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయిన ప్లే ఆఫ్ ఆశలు గల్లంతవుతాయి.

    ఇక దాంతో పాటుగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు కొంతవరకు పదిలంగా ఉంచుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలను కష్టతరం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో బెంగుళూరు టీమ్ ఎలాగైనా గెలిచి తమ అధిపత్యాన్ని చూపించుకోని వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకొవాలని చూస్తుంది. ఇక ప్లే ఆఫ్ రేస్ లో కూడా తమ జట్టును నిలపాలని చూస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే అందులోని ప్లేయర్లు కూడా చాలా మంచి ఫామ్ లో కనబడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లిసిస్, దినేష్ కార్తీక్ లాంటి ప్లేయర్లైతే అద్భుతమైన ఆట తీరును కనబరచడమే కాకుండా మ్యాచ్ పొజిషన్ ను బట్టి ఏ విధంగా అయితే ఆడాలో అలా గేమ్ ప్లాన్ ని చేంజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

    ఇక బెంగళూరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి అంటే బౌలింగ్.. వీళ్ళ బౌలర్లు బౌలింగ్ కనుక కాస్త మెరుగ్గా వేసినట్లయితే వీళ్ళను ఓడించే టీమ్ మరొకటి ఉండదనే చెప్పాలి. బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉన్న ఈ టీమ్ బౌలింగ్ కి వచ్చేసరికి మాత్రం కొంతవరకు తడబడుతుంది.

    మరి ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ వేసి ప్రత్యర్థి జట్టు అయిన ఢిల్లీ టీమ్ ప్లేయర్లను కట్టడి చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే టాప్ 4 లో ఉన్న టీమ్ లకే ప్లే ఆఫ్ కి వెళ్ళే అవకాశం దక్కుతుంది. మరి ఆ టీమ్ లు ఏంటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే…