https://oktelugu.com/

Geetha Govindam: గీత గోవిందం సినిమాలో విజయ్ స్టూడెంట్ గా చేసిన అమ్మాయి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అంటూ అతని వెంటపడే క్యారెక్టర్ లో నటించింది. ఈమె ఆ తర్వాత సమంత మెయిన్ లీడ్ లో వచ్చిన బేబీ సినిమాలో రావు రమేష్ కూతురుగా కూడా నటించింది.

Written By: , Updated On : May 12, 2024 / 04:57 PM IST
Geetha Govindam

Geetha Govindam

Follow us on

Geetha Govindam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ…పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.

ఇక ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక దాంతో పాటుగా రవి కిరణ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ హీరోగా రీష్మిక మందాన హీరోయిన్ గా నటించిన గీత గోవిందం సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ గా నటించిన ఒక అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా ఆమె పేరు ‘అనీషా డామా’…

 

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అంటూ అతని వెంటపడే క్యారెక్టర్ లో నటించింది. ఈమె ఆ తర్వాత సమంత మెయిన్ లీడ్ లో వచ్చిన బేబీ సినిమాలో రావు రమేష్ కూతురుగా కూడా నటించింది. ఇక తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో స్ట్రీమింగ్ అయిన ‘సత్తిగాని రెండు ఎకరాలు’ అనే వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అందువల్లే ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక అప్పుడు గీతగోవిందం సినిమా సమయంలో చాలా చిన్నగా ఉన్నా ఈ అమ్మాయి ఇప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాన్ని, అభినయాన్ని కనబరుస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది…