Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరుగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే కుప్ప కూలింది.. పిచ్ నుంచి లభించిన తేమను సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు భారత బ్యాటర్లను వణికించారు. కునేమాన్ 5 వికెట్లు తీశాడు.. లయాన్ 3 వికెట్లు, ముర్ఫీ ఒక వికెట్ తీశాడు.. వీరి ముగ్గురు దాటికి భారత్ 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.

జడేజా విజృంభణ
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ను జడేజా వణికించాడు. రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్, షమీ, అక్షర్ పటేల్ తేలిపోయిన చోట అతడు మెరిశాడు.. ఆస్ట్రేలియా కోల్పోయిన నాలుగు వికెట్లు అతడు ఒక్కడే తీయడం గమనార్హం.. హెడ్, ఖవాజా, లబు షేన్, స్మిత్…ఇలా టాప్ 4 వికెట్లు రవీంద్ర జడేజా ఒక్కడే తీయడం గమనార్హం.
అది బుల్లెట్
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా తీసిన లబూ షేన్ వికెట్ తొలి రోజు మ్యాచ్ కే హైలెట్.. రవీంద్ర జడేజా వేసిన బంతిని డిఫెన్స్ ఆడదామని లబూ షేన్ ప్రయత్నించాడు.. కానీ ఆ బంతి ప్యాడ్స్, గ్లవ్స్ మధ్యలో నుంచి వెళ్లిపోయి వికెట్లను నేలకూల్చింది. దీంతో లబూ షేన్ మైండ్ బ్లాంక్ అయింది. తన వికెట్ నేలకూలడాన్ని చూసి లబూ షేన్ జీర్ణించుకోలేక, తీవ్ర అసంతృప్తితో మైదానాన్ని వీడాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ” అది బంతి కాదు లబూ షేన్.. జడేజా విసిరిన బుల్లెట్… నిలువరించడం నీ తరం కాదు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక మొదటి రెండు టెస్టుల్లో రవీంద్ర జడేజా తన ప్రతాపం చూపాడు.. మొత్తం 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పటికే టెస్టుల్లో 250 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. కపిల్ దీవులాంటి దిగ్గజ ఆటగాడు రికార్డులను బ్రేక్ చేశాడు.. ఇక తొలి రోజు నలుగురు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ను పెవిలియన్ చేర్చిన జడేజా.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తాడని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
WATCH – @imjadeja sneaks one through Marnus Labuschagne's defence 👏 👏
Live – https://t.co/t0IGbs2qyj #INDvAUS @mastercardindia pic.twitter.com/H1bijSuLDJ
— BCCI (@BCCI) March 1, 2023