Auqib Nabi record haul: బారాముల్లా అనగానే మనకు గుర్తొచ్చేది జమ్మూ కశ్మీర్. ఎప్పుడు ఉగ్రదాడు, ఎన్కౌంటర్లు, పేళ్లుళ్ల ఘటనలతోనే వార్తల్లో ఉంటుంది. కర్ఫ్యూ, దాడులు, సైనిక కవాతులతో కూడిన ప్రాంతం. కానీ ఈసారి బారాముల్లా సమీపంలోని ఒక చిన్న గ్రామం షెరీ నుంచి ఓ కుర్రోడు క్రికెట్ జట్టుకోకి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొచ్చాడు. 29 ఏళ్ల పేసర్ అకిబ్ నబి జమ్మూ కశ్మీర్‌కు రంజీ ట్రోఫీలో మొదటి ఛాంపియన్షిప్ తీసుకొచ్చాడు. ఈ సీజన్ 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు కుప్పకూల్చి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.
కష్టాల మధ్య క్రికెట్‌పై పట్టు..
సౌకర్యాలు లేని ఊర్లో పెరిగిన నబి, చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. సీనియర్ పర్వేజ్ రసూల్ మార్గదర్శకత్వంలో రోజూ 60 కిమీలు ప్రయాణించి శ్రీనగర్‌లో శిక్షణ తీసుకున్నాడు. 2019లో రాష్ట్ర జట్టులో చోటు సంపాదించాడు. మొదట్లో నెమ్మది వేగం, లైన్–లెంగ్త్ సమస్యలు ఉన్నాయి. జమ్మూ కోచ్ కృష్ణ కుమార్ సహాయంతో స్వింగ్, పేస్, కచ్చితత్వం మెరుగుపరిచి బ్యాట్స్‌మెన్స్‌కు సవాల్‌గా మారాడు.
Also Read: ఏ ఊకో.. ఊకో.. పాకిస్తాన్ పని అయిపోలేదింకా..!
కోచ్ ప్రశంస..
నబి దీర్ఘకాలం బౌలింగ్ సామర్థ్యం గొప్పది. సెమీస్‌లో వరుసుగా 10 ఓవర్లు వేసి ఫిట్నెస్ నిరూపించాడు. సరళ శైలి వల్ల శరీర ఒత్తిడి లేకుండా ఫలితాలు ఇస్తున్నాడు. ముందు మరిన్ని విజయాలు ఖాయం.‘ అని కోచ్ కృష్ణకుమార్ ప్రశంసించాడు. ‘అకిబ్ నబి టీమ్ ఇండియాకు దూసుకుపోతున్నాడు. ఇంగ్లాండ్ టూర్ అతనికి స్వర్ణావకాశం. తపనతో ఏమైనా సాధ్యమేనని జమ్మూ కశ్మీర్ నిరూపించింది’ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి పేర్కొన్నాడు.
రంజీలో రికార్డుల వర్షం..
ఇక నబీ 2024–25లో 9 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు తీశాడు. ఈసారి 60 వికెట్లు. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై 7/40, 5 వికెట్లు తీశాడు. సెమీస్‌లో బెంగాల్‌పై 5+4 వికెట్లు, 42 పరుగులు చేశాడు. ఫైనల్లో కర్ణాటక్పై 5 వికెట్లు. డేల్ స్టీన్ ఆదర్శంతో కచ్చిత లైన్లు, షాట్ ఆప్పులు, లాంగ్ స్పెల్స్‌తో విభిన్నుడు. విజయ్ హజారేలో హైదరాబాద్‌పై 114 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. మొత్తం 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 151 వికెట్లు తీశాడు. 967 రన్స్ చేశాడు. ఐపెల్ ఆక్షన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లతో నబీని కొనుగోలు చేసింది.