Rajasthan Royals : రుతు రాజ్ గైక్వాడ్ దూరం కావడంతో అతని స్థానంలో మహేంద్ర సింగ్ ధోని తాత్కాలిక కెప్టెన్ గా చెన్నై జట్టును నడిపిస్తున్నాడు. ఇక ఇటీవల చెన్నై కోల్ కతా, లక్నో జట్లతో తలపడింది. ఈ రెండు మ్యాచ్ లలో చెన్నై జట్టు ధోని ఆధ్వర్యంలోనే సాగింది. ఇందులో కోల్ కతా చేతిలో చెన్నై ఓడిపోగా.. లక్నో పై మాత్రం విజయం సాధించింది. ఇక చెన్నై వ్యవహారాన్ని కాస్త పక్కన పెడితే.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ గాయపడ్డాడు.. అతడు పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగి వెళ్లిపోయాడు. దీంతో రాజస్థాన్ జట్టు ఢిల్లీ విధించిన స్కోరును చేదించలేకపోయింది. చివరికి సూపర్ ఓవర్ లోనూ తేలిపోయి ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లాలంటే మిగతా మ్యాచ్లలో విజయం సాధించాలి. నెగిటివ్ నెట్ రేట్ ఉంది కాబట్టి.. ఆడే ప్రతి మ్యాచ్లో భారీ వ్యత్యాసంతో విజయం సాధించాలి.
Also Read : ఐపీఎల్ లో సంచలనం : కెప్టెన్ ను మార్చేసిన రాజస్థాన్ రాయల్స్
ఇప్పుడు మరో షాక్
ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ లో ఓడిపోయిన రాజస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ప్రస్తుత ఐపీఎల్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్లో అతడు పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో మ్యాచ్ మధ్యలో నుంచి అతడు వెళ్లిపోయాడు. రిటైర్డ్ హర్ట్ గా వెను తిరిగాడు. అయితే అతడు లక్నో జట్టుతో శనివారం జరిగే మ్యాచ్ కు దూరం అవుతాడని తెలుస్తోంది. మరోవైపు క్రికెట్ వర్గాలు మాత్రం సంజు శాంసన్ ఐపీఎల్ ట్రోఫీ మొత్తానికి దూరమవుతాడని చెబుతున్నారు. ఎందుకంటే పక్కటెముకల గాయం నుంచి సంజు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సంజు కనక ఆడకపోతే అతని స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే సంజు మ్యాచ్ కు దూరమైతే.. అతడి స్థానంలో ఏ ఆటగాడికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లక్నో జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ జట్టును ఓడించాలంటే రాజస్థాన్ శాయశక్తులు ఒడ్డాలి. చూడాలి మరి రేపు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ ఎలా ఆడుతుందో?! అన్నట్టు గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. సూపర్ ఆటతీరుతో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. కానీ ఇప్పుడు మాత్రం అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నది.. తీవ్రంగా ఇబ్బంది పడుతూ పాయింట్ల పట్టికలో చివరి వరుసలో ఉంది.
Also Read : 78 ఇళ్ళకు సోలార్ వెలుగులు