Australia Vs South Africa Semi Final: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జట్ల మధ్యన రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే సౌతాఫ్రికా టీమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది.అయితే సౌతాఫ్రికా టీం కి మొదట్లోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తొందరగా అవుట్ అవడం తో సౌతాఫ్రికా టీం చాలా ఘోరమైన పరిస్థితిలో పడిపోయింది. ప్రస్తుతం నాలుగు వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో అయితే పడింది.ఇకఇది ఇలా ఉంటే మధ్యలో కొద్దిసేపు వర్షం కారణంగా మ్యాచ్ ని నిలిపివేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో ఆడుతున్నందు వల్ల కలకత్తాలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటూ వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది.అయితే వర్షం తీవ్రత ఎక్కువ గా ఉండటం తో మ్యాచ్ ని కొద్దిసేపు నిలిపి వేసి విశ్రాంతి తీసుకున్నారు.ఇక ఇప్పుడు మళ్లీ మ్యాచ్ స్టార్ట్ అయి యధా విధంగా సాగుతుంది వర్షం పడినప్పుడు అందరిలో ఒకటే డౌట్ ఉండేది.
ఏంటి అంటే ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ సంగతి ఏంటి అని, ఒకవేళ ఇవాళ్ళ ఫుల్ వర్షం పడి మ్యాచ్ జరగపోతే రిజర్వ్ డే కింద ఇవాళ్ళ ఎక్కడైతే మ్యాచ్ ఆగిపోయిందొ రేపు ఈ మ్యాచ్ ని అక్కడి నుంచి యధావిధిగా జరపబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఒక వేళ రేపు కూడా వర్షం వల్ల పూర్తి మ్యాచ్ ఆడకుండా మ్యాచ్ ని రద్దు చేస్తే మాత్రం లీగ్ దశలో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉండి పాయింట్స్ టేబుల్ ల్లో మెరుగ్గా ఉన్నారో వాళ్ళని ఫైనల్ కీ క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన మ్యాచ్ రెండు రోజులు జరగకుండా రద్దు అయితే సౌతాఫ్రికా టీం ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే పాయింట్స్ టేబుల్ లో రెండు టీమ్ లకి సేమ్ పాయింట్స్ ఉన్నప్పటికీ సౌతాఫ్రికా కి రన్ రేట్ కొంచెం మెరుగ్గా ఉంది. దాంతో ఇండియా మొదటి స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుంది…ఇక ఇప్పటివరకు అయితే వర్షం లైట్ గా వచ్చి వెళ్ళిపోయింది కానీ ఇక మీదట జరగబోయే మ్యాచ్ కి వర్షం అంతరాయం జరిగితే మాత్రం ఇదే రూల్ పాటించబోతున్నట్టుగా ఐసీసీ ఇంతకుముందే వివరణ ఇవ్వడం జరిగింది… మరి ఈ మ్యాచ్ యధావిధిగా జరిగితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ఇండియాతో పాటు ఫైనల్ ల్లో తలబడతారు అనేది తెలియాల్సి ఉంది…