https://oktelugu.com/

Teenmar Mallanna: కాంగ్రెస్ గెలవాలన్న తీన్మార్ మల్లన్నకు లైవ్ లో బిగ్ షాక్

తీన్మార్ మల్లన్న తన టీంతో కలిసి క్యు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. ఉదయం ఏడు గంటలకు మార్నింగ్ న్యూస్ పేరుతో వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను, దాని తెరవెనుక విషయాలను ఆయన వివరిస్తూ ఉంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 16, 2023 5:26 pm
    Teenmar Mallanna

    Teenmar Mallanna

    Follow us on

    Teenmar Mallanna: ఈ స్మార్ట్ ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అందరూ ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉంటారని అనుకోవడానికి లేదు. ఒక్కోసారి మనకు వంత పాడుతున్నారని, రెండో మాటకు తావు లేకుండా మనల్ని అనుసరిస్తున్నారని భ్రమ పడితే బొక్క బోర్లా పడటం ఖాయం. ప్రస్తుతం ఇదే పరిస్థితిని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చవిచూస్తున్నారు. క్యు న్యూస్ పేరుతో ప్రశ్నించే గొంతుకగా తనను తాను అభివర్ణించుకునే నవీన్.. ఇటీవల నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్ లో దిమ్మతిరిగే విధంగా నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

    మార్నింగ్ న్యూస్ పేరుతో..

    తీన్మార్ మల్లన్న తన టీంతో కలిసి క్యు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. ఉదయం ఏడు గంటలకు మార్నింగ్ న్యూస్ పేరుతో వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను, దాని తెరవెనుక విషయాలను ఆయన వివరిస్తూ ఉంటారు. అంతేకాదు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రశ్నించే గొంతుకగా ఆయనను చాలా మంది పిలవడం మొదలుపెట్టారు.. ఆయన కూడా ఆ పదాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ అది సరైన మార్గంలో పయనిస్తే బాగానే ఉండేది. కానీ ఎక్కడో తేడా కొట్టేసరికి మల్లన్న పై విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలను పూర్తిగా మార్చివేయాలనే తలంపు ఉన్న మల్లన్న వేసిన అడుగులు కొంచెం తడబాటుకు గురి కావడంతో ట్రోల్స్ మొదలవుతున్నాయి.

    ఒపీనియన్ పోల్ లో..

    మార్నింగ్ న్యూస్ లో ప్రతిరోజు మల్లన్న ఒపీనియన్ పోల్ నిర్వహిస్తూ ఉంటారు. ఆరోజుకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రశ్న సంధించి దానికి మూడు సమాధానాలు ఇస్తుంటారు. అయితే ఇటీవల ఆయన నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో నెటిజన్లు దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చారు. ” ఈ క్రింది వాటిలో గెలిచిన తర్వాత అమ్ముడు పోయే పార్టీ వాళ్లు ఎవరు” అని మల్లన్న ప్రశ్న సంధించగా.. చాలామంది కాంగ్రెస్ పార్టీ అని సమాధానం ఇచ్చారు. అయితే ఇందులో తెలివిగా మల్లన్న ఇతరులు అనే సమాధానం పై మల్లన్న నొక్కితే.. మెజారిటీ నెటిజన్లు మాత్రం కాంగ్రెస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా మల్లన్న ముఖం మాడిపోయింది. ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక నీతి వాక్యాలు వల్లించారు. అన్నట్టు ఇదే తీన్మార్ మల్లన్న గతంలో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. ఆ తర్వాత బిజెపిలో చేరారు. ఇప్పుడేమో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేపటి నాడు ఎందులో ఉంటారో తెలియదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం విపరీతంగా ట్రోల్ చేస్తోంది.