పవన్ మద్దతు కోసం కదిలివచ్చిన రత్నప్రభ, బీజేపీ పెద్దలు

జనసేనను కాదని తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ నేతలు కలిసికట్టుగా కదిలివచ్చారు. హైదరాబాద్ కు వచ్చి మరీ జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బీజేపీ తిరుపతి అభ్యర్థి రత్నప్రభ తదితరులు హైదరాబాద్ వచ్చారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున అభ్యర్థిగా ఖరారైన రత్నప్రభ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కలిశారు. హైదరాబాద్ లోని జనసేన […]

Written By: NARESH, Updated On : March 26, 2021 8:37 pm
Follow us on

జనసేనను కాదని తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన బీజేపీ నేతలు కలిసికట్టుగా కదిలివచ్చారు. హైదరాబాద్ కు వచ్చి మరీ జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా బీజేపీ తిరుపతి అభ్యర్థి రత్నప్రభ తదితరులు హైదరాబాద్ వచ్చారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున అభ్యర్థిగా ఖరారైన రత్నప్రభ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కలిశారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు.

బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా రత్నప్రభ హైదరాబాద్ వచ్చి మరీ పవన్ తో భేటి కావడం విశేషం. తిరుపతిలో ఆమె గెలవాలంటే బీజేపీ మద్దతు మాత్రమే సరిపోదని.. జనసేనది కావాలని గ్రహించి బీజేపీ నేతలందరినీ  తోడ్కొని వచ్చారని తెలుస్తోంది.

ఇక పవన్ సైతం తిరుపతి సీటును బీజేపీకి ఇచ్చి తన మానాన తను సినిమాలు చేస్తూ పోతున్నాడు. సినిమాల్లో బిజీ అయ్యారు. పవన్ ప్రచారానికి వస్తాడో రాడో తెలియని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే తిరుపతిలో జనసేన క్యాడర్, మద్దతుదారులు బీజేపీకి దూరం అయిపోతారన్న ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలంతా కలిసి పవన్ కళ్యాన్ మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాన్ తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ చార్జి సునీల్ ధేవ్ ధర్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ ను ప్రచారానికి రావాల్సిందిగా కోరినట్టు తెలిసింది. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి పవన్ తో బీజేపీ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.