Shubaman Gill : గిల్ అరుదైన ఘనత.. ద్రావిడ్ రికార్డు సమం…

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తొలి టెస్టులో తలపడుతోంది. ఈ టెస్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, గిల్ సెంచరీలు సాధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 21, 2024 7:18 pm

Shubaman Gill

Follow us on

Shubaman Gill : తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో గిల్ సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు.. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు.. రిషబ్ పంత్ (109) తో కలిసి నాలుగో వికెట్ 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండవ ఇన్నింగ్స్ లో గిల్(119*) సత్తా చాటాడు.. రిషబ్ పంత్ దూకుడుగా ఆడినప్పటికీ.. గిల్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు..గిల్ గత నాలుగు టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్ లలో 86*, 52*, 91, 119* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక చెన్నై టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 119* పరుగులు చేసి రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేశాడు. రాహుల్ ద్రావిడ్ తన 35వ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. గిల్ కూడా తన 35 వ టెస్ట్ లోనూ సెంచరీ చేసి.. ద్రావిడ్ ఘనతకు సమానంగా నిలిచాడు.. తొలి ఇన్నింగ్స్ లో గిల్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో అతడు తన బ్యాటింగ్ శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. రిషబ్ పంత్ తో కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు.

గిల్ – పంత్ దూకుడు

తొలి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 144/6 వద్ద ఉన్న జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ – గిల్ నాలుగో వికెట్ కు 167 పరుగుల పార్టనర్షిప్ ఏర్పాటు చేశారు. గిల్ మొత్తంగా తన కెరియర్లో ఐదవ సెంచరీ చేశాడు. 160 బంతులు ఎదుర్కొని అతడు సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 287 రన్స్ చేసింది. దీంతో రోహిత్ టీమ్ ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా భారత్ బంగ్లాదేశ్ ఎదుట 514 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జాకిర్ హసన్ (33), షాద్మాన్ ఇస్లాం (35), మోమినుల్ హక్(13), ముష్పీకర్ రహీం (13) పరుగులు చేశారు. షకీబ్ ఉల్ హసన్(5*), షాంటో(51*) క్రీజ్ లో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ మూడు, బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. పిచ్ హఠాత్తుగా స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తోంది. బంతి ఊహించని మలుపులు తిరుగుతోంది. దీంతో బంగ్లా బౌలర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.