Tirumala Laddu : జగన్ ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు.. అప్పుడే తిరుమలలో అగ్ని, వాయువులు హెచ్చరికలు పంపాయా?

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యి వాడారని.. అందులో జంతువుల వ్యర్ధాల నుంచి తీసిన పదార్థాలను వాడారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికార కూటమి ప్రభుత్వం లోతుగా తవ్వుతుండగా.. ఇది చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం అని వైసిపి అంటోంది. ఈ చర్చ జరుగుతుండగానే మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 21, 2024 7:10 pm

Tirumala Laddu

Follow us on

Tirumala Laddu :  2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడు నెలలకు తిరుమలలో డిసెంబర్ నెలలో బూంది పోటు లో ఒకసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి బూంది సిద్ధం చేస్తుండగా పొయ్యి నుంచి ఒక్కసారిగా మంటలు చెలిరేగాయి. ” పోటు గోడలకు నెయ్యి మరకలు అంటుకున్నాయి. ఆ మరకలకు మంటలు అంటుకున్నాయి. మంటల తాకిడికి బూంది తయారీ కోసం వినియోగించే ముడి సరుకు మొత్తం కాలిపోయింది” ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మూడు వాహనాలతో వచ్చారు. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడ్డాడు. అతడిని బాలాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం లడ్డు ప్రసాదం గురించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నాటి ఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నాడు అగ్నిప్రమాదం జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు.

గుర్తించలేదా?

” సహజంగా యజ్ఞాలు, యాగాలు చేసే సమయంలో దేవతలకు అగ్ని దేవుడు హోమ ద్రవ్యాలను దేవతలకు చేర్చే పని భుజానికి ఎత్తుకుంటాడు. కానీ తిరుమలలో వేంకటేశ్వర స్వామికి వకుళ మాత ప్రసాదం తయారు చేస్తుంది. అయినప్పటికీ స్వామి వారు బూంది పోటు లో జరుగుతున్న దారుణం చూడలేక ఆగ్రహం వ్యక్తం చేశారు.. అగ్ని కీలలతో బుసలు కొట్టారు. వాయువుతో గోడకున్న నెయ్యి మరకలకు అంటించి చూపారు. నాటి రోజుల్లో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉంటే స్వామివారి సంకేతాలను అవగతం చేసుకునేవారు. కానీ అలా జరగలేదు.. గాయత్రి మంత్రోపాసకులు, పీఠాధిపతులు, గొప్ప గొప్ప వాళ్ళు.. స్వామి పేరు పఠిస్తూ.. గోవిందా గోవిందా అంటూ ఆ లడ్డూలను మహా ప్రసాదంగా తిన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి ప్రసాదమా మేము తిన్నది అని బాధపడుతున్నారని” కూటమి నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రక్షాళన మొదలు పెట్టాల్సిందే

తిరుమల లడ్డు ప్రసాదం పై వివాదం ఏర్పడుతున్న నేపథ్యంలో స్వామివారి ఆలయాన్ని ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. లడ్డు ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయాలని భక్తుల కోరుతున్నారు. స్వామి వారి కోవెలలో సంప్రోక్షణ జరగాలని.. అగ్ని, వాయువు, అష్టదిక్పాలకులు శాంతించాలని.. తిరుమల వైభోగం మరింత పెరగాలని భక్తులు ప్రస్తుత.. ఏడుకొండల వాడికి విన్నవిస్తున్నారు. తిరుపతి లడ్డుకు ఉన్న విశిష్టతను ధ్వంసం చేయొద్దని కోరుతున్నారు.