https://oktelugu.com/

Pawan Kalyan : తన సినిమాలను తొక్కించుకునే స్థాయి నుండి..ఇచ్చే స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్..సక్సెస్ అంటే ఇదే!

పవన్ కళ్యాణ్ లేనిదే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు లేవు అనేంతలా ఆరంభ దశలోనే తన సత్తా చాటాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసుకున్నాడు, సినిమా ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్స్ తో పార్టీ ని నడుపుకున్నాడు. అలా 2019 వ ఎన్నికలలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాకపోయినప్పటికీ పోటీ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 07:50 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు అనేందుకు లేటెస్ట్ ఉదాహరణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కి కూడా సాధించలేని అరుదైన ఘనత ని సాధించి చరిత్ర సృష్టించాడు. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే సినిమాలను ఒదిలి కుట్ర పూరితమైన రాజకీయాల్లోకి దిగాలని అనుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. 2014 ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లో కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ లేనిదే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు లేవు అనేంతలా ఆరంభ దశలోనే తన సత్తా చాటాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసుకున్నాడు, సినిమా ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్స్ తో పార్టీ ని నడుపుకున్నాడు. అలా 2019 వ ఎన్నికలలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాకపోయినప్పటికీ పోటీ చేసాడు.

    ఒక్క పైసా కూడా పంచకుండా 20 లక్షలకు పైగా ఓట్లు సంపాదించినప్పటికీ, పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ ద్వారా కేవలం రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచాడు. ఆయన కూడా కొన్ని రోజులకు వైసీపీ లో చేరిపోయాడు. అలా 2019 నుండి 2024 వరకు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల నుండి ఏ స్థాయిలో తిట్టించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం. కొంతమంది నాయకులూ అయితే ఏకంగా చెప్పులు కూడా చూపించి దుర్భాషలాడారు. అంతే కాదు, ఆయన తల్లిని, కూతురుని కూడా వదలలేదు, ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వం, నువ్వెంత నీ బ్రతుకెంత అని తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసి అవమానించారు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న జగన్ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా ఏ స్థాయిలో విమర్శించాడో మనమంతా గడిచిన ఐదేళ్ళలో చూసాము. ఇవన్నీ చాలవు అన్నట్టు, పవన్ కళ్యాణ్ ని ఆర్థికంగా కూడా తొక్కేయాలని చూసారు.

    ఆయన సినిమాలకు అతి తక్కువ టికెట్ రేట్స్ ని కేటాయించేవారు, దానివల్ల 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన సినిమాలు 100 కోట్ల వద్దనే ఆగిపోయాయి. ఎమ్మార్వోలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు థియేటర్స్ వద్ద కూర్చొని టికెట్స్ అమ్మిన రోజులవి. అలాంటి స్థాయి నుండి నేడు పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అపరిమితమైన సేవలు అందించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరో వారం లో ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కావాల్సిన అన్ని విధాల అనుమతులను మంజూరు చేయించినందుకు సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు చెప్పారు ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ టీం. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలను తొక్కించుకునే స్థాయి నుండి, తన తోటి హీరోల సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే అనుమతిని ఇచ్చే రేంజ్ కి ఎదిగిన పవన్ కళ్యాణ్ ని చూసి ఆయన అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.