https://oktelugu.com/

భారత్‌దే ఆధిపత్యం

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్‌ తీవ్రంగా దెబ్బతింది. చరిత్రలో కనీవినీ ఎరుగని పర్‌‌ఫార్మెన్స్‌తో చేజేతులా మ్యాచ్‌ను సమర్పించారు. ఇక ఇప్పుడు సెకండ్‌ టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్‌ అజింక్య రహానె 200 బంతుల్లో 104 అజేయ శతకానికి తోడు జడేజా 104 బంతుల్లో 40 నాటౌట్‌గా రాణించడంతో భారత్‌ 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 / 03:28 PM IST
    Follow us on


    ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్‌ తీవ్రంగా దెబ్బతింది. చరిత్రలో కనీవినీ ఎరుగని పర్‌‌ఫార్మెన్స్‌తో చేజేతులా మ్యాచ్‌ను సమర్పించారు. ఇక ఇప్పుడు సెకండ్‌ టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. రెండో రోజు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్‌ అజింక్య రహానె 200 బంతుల్లో 104 అజేయ శతకానికి తోడు జడేజా 104 బంతుల్లో 40 నాటౌట్‌గా రాణించడంతో భారత్‌ 82 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది.

    Also Read: కోహ్లీని మించిపోయిన బుమ్రా

    దీంతో ఆదివారం ఆట పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పుజారా మరోసారి నిరాశ పరిచాడు. ఒక వికెట్‌ నష్టపోయి 36 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌గిల్‌ (45), పుజారా (17)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపాడు కమిన్స్‌. దీంతో భారత్‌ 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె, హనుమ విహారి బాధ్యతగా ఆడి వికెట్‌ కోల్పోకుండా తొలి సెషన్‌ కంప్లీట్‌ చేశారు. అప్పటికి టీమిండియా స్కోరు 90/3.

    లంచ్‌ తర్వాత నిలకడగా ఆడిన విహారి.. లైయన్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు పోయి ఔటయ్యాడు. దీంతో 116 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌‌ రిషభ్‌ పంత్‌ (29) చక్కటి షాట్లతో అలరించాడు. రహానెతో కలిసి ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అయితే.. పంత్‌ కుదురుకున్నట్లే కనిపించగా.. స్టార్క్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

    Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్: పట్టుబిగించిన టీమిండియా

    అనంతరం రవీంద్ర జడేజా బరిలోకి దిగిన కాసేపటికే వర్షం పడడంతో రెండో సెషన్‌ను ముందుగానే ముగించారు. టీ విరామ సమయానికి 189/5 స్కోరుతో నిలిచింది. ఇక చివరి సెషన్‌లో రహానె, జడేజా పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రహానె ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవైపు జడేజా సైతం అతడికి సహకరించాడు. ఆట నిలిచే సరికి 104 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉండగా.. ఆట ముగిసే సమయానికి రహానె టెస్టుల్లో 12వ శతకం పూర్తి చేశాడు.