https://oktelugu.com/

డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి హెచ్చరిక

డబుల్ బెడ్ రూం ఇల్లు అమ్మకుంటే కేసు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగంగా సిద్ధిపేటలోని కేసీఆర్ కాలనీలో ఆదివారం 168 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులకే దక్కాలన్నారు. ఎవరైనా ఈ ఇంటిని అమ్ముకుంటే కేసు పెడతామని హెచ్చరించారు. కాగా గత నెలలో కేసీఆర్ సిద్ధిపేటలో […]

Written By: , Updated On : December 27, 2020 / 03:33 PM IST
harish rao

harish rao

Follow us on

harish rao

డబుల్ బెడ్ రూం ఇల్లు అమ్మకుంటే కేసు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో భాగంగా సిద్ధిపేటలోని కేసీఆర్ కాలనీలో ఆదివారం 168 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులకే దక్కాలన్నారు. ఎవరైనా ఈ ఇంటిని అమ్ముకుంటే కేసు పెడతామని హెచ్చరించారు. కాగా గత నెలలో కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీని ప్రారంభించారు. తాజాగా మరో 168 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు.