PV Sindhu: వివాహం జరిగిన అనంతరం ఒకరోజు గ్యాప్ తర్వాత హైదరాబాదులో పివిసింధు, వెంకట దత్త సాయి రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాముండేశ్వరి నాథ్ వంటి వారు పివి సింధు వివాహానికి హాజరయ్యారు. సింధు వివాహం ఉదయపూర్ ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన హోటల్లో జరిగింది. ఈ హోటల్ మొత్తం ఒక ద్వీపం లాగా ఉంటుంది. అందులోకి వెళ్లాలంటే పడవపై ప్రయాణించడమే మార్గం. అలా వచ్చిన అతిధులను మొత్తం పడవల ద్వారానే ఆ హోటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వివాహం అత్యంత ఘనంగా జరిపారు. రాజస్థానీ మెనూను అతిథులకు వడ్డించారు. షడ్రసోపేతమైన రుచులతో అతిధులకు అదిరిపోయే ఆతిధ్యాన్ని అందించారు. ఇందుకోసం వందలాది చెఫ్ లు వంటకాలను సిద్ధం చేశారు. వారిని దేశంలోని సుప్రసిద్ధ ప్రాంతాల నుంచి రప్పించారు.. పీవీ సింధు వివాహ వేడుక మూడు రోజులపాటు జరిగింది. మెహందీ, సంగీత్ వేడుక హైదరాబాదులో జరగగా.. వివాహం రాజస్థాన్లో జరిగింది. రిసెప్షన్ హైదరాబాదులో అంగరంగ వైభవంగా సాగింది..
అదరగొట్టింది
పీవీ సింధు ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఒలంపిక్ మెడల్ విన్నర్ కూడా. రెండుసార్లు ఆమె ఒలంపిక్స్ మెడల్స్ సాధించింది. అయితే ఇటీవల జరిగిన పారిస్ ఒలంపిక్స్ లో దురదృష్టవశాత్తు వెను తిరిగింది. ఆ తర్వాత కొన్ని మేజర్ టోర్నీలలో ఓడిపోయింది. ఇదే క్రమంలో వెంకట దత్త సాయి ఆమెను ప్రోత్సహించాడు. ఆమెలో ఉన్న లోపాలను చెప్పాడు. ఫలితంగా పీవీ సింధు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. విజయాల బాట పట్టింది. ఇదే క్రమంలో వెంకట దత్త సాయి, పివి సింధు దగ్గరయ్యారు. వీరిద్దరి వ్యవహారాన్ని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా వెంకట దత్త సాయి, పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వివాహం తర్వాత పివి సింధు బారాత్ లో అదరగొట్టే డ్యాన్స్ వేశారు. దసరా సినిమాలో కీర్తి సురేష్ డ్యాన్స్ స్టెప్ మ్యూజిక్ కు పీవీ సింధు కాళ్లు కదిపారు. హోరెత్తించే మ్యూజిక్ వస్తుండగా సింధు అదిరిపోయే డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. పీవీ సింధు డ్యాన్స్ వేయడం చూసి.. నెటిజన్లు సంబరపడుతున్నారు. మైదానంలోనే కాదు.. మైదానం వెలుపల కూడా పీవీ సింధు అదరగొడుతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు, వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్లోని ఉదయపూర్ ప్రాంతంలో వీరి వివాహం జరిగింది. హైదరాబాదులో రిసెప్షన్ కూడా అట్టహాసంగా జరిగింది. పెళ్లి బారాత్ లో సింధు డ్యాన్స్ వేసింది.#PVSindhu#PVSindhuWedding pic.twitter.com/ArIDv3OF12
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024