https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు సమయం అనుకూలం.. కొత్త ప్రాజెక్టులు చేపడితే పంట పండినట్లే..

పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2024 / 07:56 AM IST

    Horoscope Today(6)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య ఫలితాలు ఉండనున్నాయి. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం. ఉద్యోగులు సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నారు చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సాయం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల పూర్తి చేయడంలో ఇతరుల సహాయం అందుతుంది.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరు తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. అనవసర వా వాదనలకు వెళ్లకుండా ఉండాలి.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉండనుంది. కొన్ని లక్ష్యాలు పూర్తి చేయడం వల్ల పదోన్నతి లభించే అవకాశం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడుల కోసం పెద్దల తీసుకోవాలి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల దుబారా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కాలానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. కొందరు తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి ఫలించవు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కొన్ని పనులు కష్టంగా ఉంటాయి. అయినా వెనకడుగు వేయకుండా ఉండాలి. కొందరి వ్యక్తుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు పడతారు. అలాంటి వారితో ఉండాలి. ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం. అయితే కొత్తపెట్టబడల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్త వింటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) పెండింగ్ పనులను పూర్తిచేస్తారు గతంలో మొదలుపెట్టిన ఓ ప్రాజెక్టు పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఓవైపు ఆదాయం పెరుగుతున్నా.. మరోవైపు ఖర్చులు ఉంటాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కష్టపడి పనిచేసిన వారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కొన్ని ప్రయాణాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగాల్లో పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.