PV Sindhu Wedding: సింధు, యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో కొంతకాలంగా అనుబంధం ఉంది. ఏడాదిగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. దత్త సాయి కొంతకాలంగా పీవీ సింధు ఆడుతున్న మ్యాచ్. లకు ఆమెతో కలిసి హాజరవుతున్నాడు.. అతను రమణ (పీవీ సింధు తండ్రి) కుటుంబానికి దగ్గర వ్యక్తి. దత్త సాయి బెంగళూరులోని ట్రిపుల్ ఐఐటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాదులో పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతడి తండ్రి పేరు జీటి వెంకటేశ్వరరావు. ఈ కంపెనీని స్థాపించింది ఆయనే. ఈ కంపెనీ టెక్నాలజీ బేస్ కార్యకలా పలు సాగిస్తోంది. వేలాదిమంది ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, యూరప్ దేశాలలోని పలు కంపెనీలకు పోసిడెక్స్ టెక్నాలజీ టెక్ సపోర్ట్ అందజేస్తోంది. ఇక పీవీ సింధు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నది. కొంతకాలంగా పివి సింధు వివాహంపై రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ వాటిని ఆమె కుటుంబం ఖండించింది. చివరికి దత్త, సింధు మధ్య బంధం ఏర్పడడం.. అతడు దగ్గర కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో.. వివాహం చేయడానికి ఆమె తండ్రి పివి రమణ అంగీకరించాడు. గత కొంతకాలంగా దత్త, సింధు కలసి కొన్ని మ్యాచ్లకు హాజరయ్యారు.. కలిసి సినిమాలు కూడా చూశారు. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలలో ఆడాల్సి ఉంది. దీంతో ఆమెకు ఈ నెలలో వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
రెండు సంవత్సరాలుగా ఫామ్ లేమి
పీవీ సింధు రెండు సంవత్సరాలుగా ఫామ్ లేని తో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఇటీవల సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీలో ఛాంపియన్ గా ఆవిర్భవించింది. సింధు 2013లో వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. 2019లోను ప్రపంచ ఛాంపియన్ షిప్ దక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతాన్ని సాధించింది. 2021 టోక్యో క్రీడల్లో కాంస్యం దక్కించుకుంది. రెండు మెడల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. 2017 బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి చేరుకుంది. ఇటీవల ఫామ్ లోకి వచ్చిన సింధు 2028 ఒలంపిక్స్ వరకు ఆడాలని భావిస్తోంది. అవకాశం ఉంటే మెడల్ సాధిస్తానని చెబుతోంది. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించి రిటర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల గాయాల బారిన పడిన సింధు త్వరగానే కోలుకుంది. సయ్యద్ మోడీ టోర్నీలో సత్తా చాటింది. తన పూర్వపు ఫాం ప్రదర్శిస్తూ అదరగొట్టింది. సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.