Homeక్రీడలుPV Sindhu Wedding: నేడు పీవీ సింధు, వెంకట దత్త సాయి వివాహం.. విందులో ఏ...

PV Sindhu Wedding: నేడు పీవీ సింధు, వెంకట దత్త సాయి వివాహం.. విందులో ఏ వంటకాలున్నాయంటే?

PV Sindhu Wedding: పెళ్లి వేడుక కోసం ఈ హోటల్ ను అందంగా అలంకరించారు. అతిధులను వేదిక వద్దకు పడవల ద్వారా తీసుకువస్తారు. అలంకరణ మొత్తం రాజస్థానీ శైలిలో చేపట్టారు. పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం మేవారి రుచులను అందించనున్నారు. ఈ వంటకాలు మొత్తం పూర్తిగా రాజస్థానీ శైలిలో ఉంటాయి. రాజస్థాన్ అంటే రాజసం గుర్తుకు వస్తుంది కాబట్టి.. పెళ్లి విందులోనూ మేవారీ వంటకాలను వడ్డిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. దీనికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. శుక్రవారం హల్ది సంబరాలు నిర్వహించారు. శనివారం సంగీత్, మోహన్ది వేడుక నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వరమాల నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి 11:30 నిమిషాల ముహూర్తానికి పెళ్లి వేడుక నిర్వహిస్తారు. అయితే ఈ పెళ్లి వేడుకకు దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులను పివి సింధు ఆహ్వానించారు..

పెళ్లికి పరిమిత సంఖ్యలో..

వివాహం అనంతరం నిర్వహించే విందుకు భారీగా అతిధులను ఆహ్వానించినప్పటికీ.. పెళ్లికి మాత్రం పరిమిత సంఖ్యలో ఆత్మీయులను ఆహ్వానించారు. పెళ్లి వేడుక అనంతరం హైదరాబాదులో మంగళవారం రిసెప్షన్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, క్రీడా ప్రముఖులను పీవీ సింధు తన భర్తతో కలిసి వివాహ విందుకు హాజరు కావాలని ఆహ్వానించారు. పీవీ సింధు ప్రతిష్టాత్మకమైన ఒలంపిక్ క్రీడల్లో రెండు మెడల్స్ సాధించింది. ఛాంపియన్ షిప్ సహా పలు మేజర్ టోర్నీలలో విన్నర్ గా నిలిచింది. చిన్నతనం నుంచే తీవ్రంగా కష్టపడి.. స్టార్ షట్లర్ గా అవతరించింది. తనకు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఎప్పటినుంచో పరిచయం

సింధు, దత్త సాయి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో స్నేహం కొనసాగుతోంది. ఇటీవల వీరిద్దరి పెళ్లిని రెండు కుటుంబాలు ఓకే చేశాయి. వెంకట దత్త సాయి ఫొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. వెంకట దత్త సాయి తండ్రి వెంకటేశ్వరరావు ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారిగా పని చేశారు. ఇటీవల పదవి విరమణ చేశారు. ఫొసిడెక్స్ కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ కంపెనీ ఇప్పటివరకు “ధరణి పోర్టల్” ను నిర్వహించింది. దత్త సాయి డేటా సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన స్వతహాగా క్రీడాభిమాని కూడా. జెఎస్డబ్ల్యు సంస్థలో వెంకట దత్త సాయి పని చేశారు. ఆ సమయంలో ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఐటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సింధు ఆడిన టోర్నీలకు వెంకట దత్త సాయి హాజరయ్యారు. ఆమెను ప్రోత్సహించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular