Pushpa Craze
Pushpa Craze : వివాదాలు, టికెట్ రేట్లు పెంచడం, శ్రీ తేజ్ అనారోగ్యం, అల్లు అర్జున్ అరెస్ట్.. వీటన్నింటినీ పక్కన పెడితే పుష్ప సినిమా దేశం మొత్తం సంచలనం సృష్టించింది.. అల్లు అర్జున్ ” తగ్గేది లే” అనే మాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఎక్కడ ఒకచోట తగ్గేదేలే అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ మేనరిజం తాలుకూ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ లోనూ అల్లు అర్జున్ మానియా కనిపించింది.. ఐపీఎల్ లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.. తద్వారా ఐపీఎల్ 18వ ఎడిషన్ లో తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రెండవ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. అయితే మూడవ మ్యాచ్లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించడం విశేషం.. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 రన్స్ స్కోర్ చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యం తో రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 176 పరుగుల వద్దే ఆగిపోయింది. రాజస్థాన్ జట్టులో నితీష్ రాణా 81, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రుతు రాజ్ గైక్వాడ్ 63 పరుగులతో టాప్ స్కోరర్ లుగా నిలిచారు.
Also Read : ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే
దెబ్బ కొట్టిన హసరంగ
గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడానికి.. రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి ప్రధాన కారణం హసరంగ. శ్రీలంక జట్టుకు చెందిన ఈ ఆటగాడు అద్భుతమైన స్పిన్ బౌలింగ్ వేయగలడు. బంతిని రకరకాలుగా తిప్పగలడు. అందువల్లే ఆదివారం నాడు జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని ఇతడు శాసించాడు. రాహుల్ త్రిపాటి (23), రుతు రాజ్ గైక్వాడ్(63), శివం దుబే (18), విజయ్ శంకర్(9) .. ఇలా నలుగురు కీలకమైన చెన్నై బ్యాటర్లను హసరంగ అవుట్ చేసాడు. ముఖ్యంగా గైక్వాడ్.. రాహుల్ త్రిపాఠి.. శివం దుబే వికెట్లను పడగొట్టి చెన్నై జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు హసరంగ. అందువల్లే చెన్నై జట్టు ఓడిపోయింది. రాజస్థాన్ విధించిన లక్ష్యాన్ని చేజ్ చేయడంలో తడబడింది.. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి వికెట్ పడగొట్టిన తర్వాత హసరంగ మైదానంలో పుష్ప సినిమా మేనరిజాన్ని ప్రదర్శించాడు. తగ్గేదే లే అన్నట్టుగా తన హావభావాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం హసరంగ మీడియాతో మాట్లాడాడు. ” నేను ఎన్నో సినిమాలు చూస్తుంటాను. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ప్రదర్శించిన మేనరిజం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అందువల్లే రాహుల్ వికెట్ తీసిన తర్వాత తగ్గేదేలే మేనరిజాన్ని ప్రదర్శించాను. ఆ వికెట్ తర్వాత.. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. మరో మూడు వికెట్లు తీసే శక్తి నాకు అందించిందని” హసరంగ అభిప్రాయపడ్డాడు.
Also Read : ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఆడిన ప్లేయర్లు ఎవరంటే?