https://oktelugu.com/

IPL 2025: ఐపీఎల్‌లో 18 సీజన్లలో ఆడిన ప్లేయర్లు ఎవరంటే?

IPL 2025 కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. అది కూడా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచే మొత్తం 18 సీజన్‌లో కూడా ఆడాడు.

Written By: , Updated On : March 31, 2025 / 01:00 AM IST
IPL 2025 (16)

IPL 2025 (16)

Follow us on

IPL 2025: దేశవ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లీగ్ ఎప్పుడు వస్తుందని ఎందరో ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్ ప్రారంభం అయితే చాలు.. పనులు అన్ని కూడా పక్కన పెట్టి మరి మ్యాచ్‌లు చూస్తుంటారు. ఎందరో టాలెంటెండ్ ఉన్న ఆటగాళ్లు ఈ ఐపీఎల్ ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతారు. అయితే ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. మొత్తం 10 జట్లు ఈ ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడుతున్నాయి. అయితే ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో ఎందరో కొత్త ఆటగాళ్లు వస్తుంటారు పోతుంటారు. గత సీజన్‌లో ఉన్న ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఉండరు. ఈ సీజన్‌లో ఉన్న ఆటగాళ్లు తర్వాత సీజన్‌లో ఉండకపోవచ్చు. అయితే ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సీజన్‌లో ఉన్న ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

ఎంఎస్ ధోనీ
2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ధోనీ ఉన్నాడు. మొత్తం 18 సీజన్లలో ఆడాడు. మొదటిలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. అయితే మధ్యలో సస్పెన్షన్‌ను గురైతే రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.

విరాట్ కోహ్లీ
కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. అది కూడా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచే మొత్తం 18 సీజన్‌లో కూడా ఆడాడు. అన్ని సీజన్‌లో ఒకే జట్టుకు ఆడిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరునే ఉంది. ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు.

రోహిత్ శర్మ
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 2008లో డెక్కన ఛార్జర్స్ తరఫున ఆడుతున్నాడు. మొత్తం 18 సీజన్‌లో రోహిత్ శర్మ ఆడాడు. 2011 నుంచి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. రోహిత్ కెప్టెన్‌గా ఐదు సార్లు ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

రవీంద్ర జడేజా
2008లో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత మళ్లీ 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడాడు. 2012 తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. మళ్లీ సస్పెన్షన్‌ను గురి కావడంతో 2016, 2017లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు.

అజింక్య రహానే
అజింక్య రహానే రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.