Scam Call in Vishaka
Vishaka : ఒకే ఒక్క రాంగ్ ఫోన్ కాల్ కు( wrong phone call) మూల్యం.. అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు. నిజంగా ఆశ్చర్యమే.. కానీ మీరు వింటున్నది నిజం. రాంగు కాల్ ద్వారా పరిచయమైన ఒక మహిళ నుంచి భారీగా డబ్బులు గుంజాడు ఓ వ్యక్తి. అతన్ని పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లు ఈ తతంగం కొనసాగుతోంది. విశాఖలో వెలుగు చూసింది ఈ ఘరానా మోసం. బాధితురాలిది విశాఖ కాగా.. నిందితుడిది మాత్రం తిరుపతి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : జై షాను పట్టేసిన లోకేష్.. తెర వెనుక అదే!
* అలా పరిచయమై..
2020లో కొవిడ్ సమయం నడుస్తోంది. ఆ సమయంలో తిరుపతికి చెందిన అక్షయ్ కుమార్( Akshay Kumar ) విశాఖకు చెందిన మహిళతో ఫోన్ రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఆమెకు తరచు ఫోన్ చేసి మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు. ఆమె స్పందించకపోతే తన దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయని.. వాటిని భర్తకు పంపిస్తానంటూ బెదిరించేవాడు. విశాఖలోని మద్దిలపాలెంలో పది లక్షల రూపాయలు తీసుకురావాలని చెప్పాడు. కారులో ఒక హోటల్కు తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ వీడియోను రహస్యంగా రికార్డు చేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా అక్షయ్ కుమార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఆమె నుంచి వసూలు చేశాడు. 800 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నాడు.
* పెరిగిన వేధింపులు
అయితే ఇటీవల అతడి వేధింపులు ఆగలేదు. తరచూ తన కోరిక తీర్చాలని.. లేకుంటే వీడియోలు భర్తకు పంపిస్తానని.. యాసిడ్ పోస్తానని.. పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడు. వారం కిందట విశాఖ బీచ్ రోడ్ లోని ఓ హోటల్ కు రమ్మని ఫోన్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈనెల 23న విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో( Visakha 3 Town Police Station ) ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
* లోతుగా దర్యాప్తు..
అక్షయ్ కుమార్ పై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు నుంచి కారు, 65 గ్రాముల బంగారం, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంక్ ఖాతాల్లో సుమారు రెండు కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.