https://oktelugu.com/

IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్లు వీరే

IPL 2025 కోట్లు వెచ్చించి మరి టాప్ ఆటగాళ్లను ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈ ఐపీఎల్ ఎందరో కుర్రాళ్లను అంతర్జాతీయ స్టార్లుగా మార్చింది.

Written By: , Updated On : March 31, 2025 / 02:00 AM IST
IPL 2025 (15)

IPL 2025 (15)

Follow us on

IPL 2025: ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 17 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. గత పదిహేడు ఏళ్ల నుంచి ఐపీఎల్‌ను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ చూస్తున్నారు. ఈ ఐపీఎల్ లీగ్ చాలా ఖరీదైనది. కోట్లు వెచ్చించి మరి టాప్ ఆటగాళ్లను ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈ ఐపీఎల్ ఎందరో కుర్రాళ్లను అంతర్జాతీయ స్టార్లుగా మార్చింది. అయితే గత 17 ఏళ్ల నుంచి చూసుకుంటే.. ఎందరో ఆటగాళ్లు తమ ఆటతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. ఒక్క క్యాచ్ మ్యాచ్‌ విన్నింగ్‌నే మార్చేస్తుంది. గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడించాలన్నా.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను గెలిపించాలన్నా కూడా క్యాచ్ కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం ఐపీఎల్ అన్ని సీజన్లలో చూసుకుంటే ఎందరో ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పిన సంఘటనలు ఉన్నాయి. అయితే మొత్తం ఐపీఎల్‌లో చరిత్రలో ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వారిలో విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడి మొత్తం 114 క్యాచ్‌లు అందుకున్నాడు. కోహ్లీ ఆర్సీబీ జట్టులో మొదటి నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నాడు. తన ఫీల్డింగ్‌తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తర్వాత సురేశ్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 109 క్యాచ్‌లతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఉన్నాడు. మొత్తం 189 ఐపీఎల్‌ మ్యాచ్‌లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇతని తర్వాత రవీంద్ర జడేజా 240 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు, ఆ తర్వాత రోహిత్ శర్మ 257 మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు అందుకున్నారు. ఐపీఎల్ మొత్తం సీజన్‌లో ఎన్నో అద్భతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో..
శిఖర్ ధావన్ 222 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు
ఏబీ డివిలియర్స్ 184 మ్యాచ్‌ల్లో 90 క్యాచ్‌లు
డేవిడ్ వార్నర్ 184 మ్యాచ్‌ల్లో 90 క్యాచ్‌లు
మనీష్ పాండే 171 మ్యాచ్‌ల్లో 83 క్యాచ్‌లు
ఫాఫ్ డుప్లెసిస్ 145 మ్యాచ్‌లు 81 క్యాచ్‌లు
డ్వేన్ బ్రావో 161 మ్యాచ్‌ల్లో 80 క్యాచ్‌లు
డేవిడ్ మిల్లర్ 130 మ్యాచ్‌ల్లో 75 క్యాచ్‌లు
అక్షర్ పటేల్ 150 మ్యాచ్‌ల్లో 72 క్యాచ్‌లు
అజింక్యా రహానే 185 మ్యాచ్‌ల్లో 70 క్యాచ్‌లు
హార్దిక్ పాండ్యా 137 మ్యాచ్‌ల్లో 69 క్యాచ్‌లు