https://oktelugu.com/

Punjab Kings: పంజాబ్ టీమ్ కి గెలిచే సత్తా ఉంది కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్లే ఓడిపోతున్నారు..?

ఐపిఎల్ సీజన్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇదిలా ఉంటే పంజాబ్ టీం విషయానికి వస్తే ఈ టీంలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు టీమ్ ను గెలుపు దిశగా తీసుకెళ్ళలేకపోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : April 18, 2024 / 02:12 PM IST

    Punjab team has the ability to win but they are losing because of that one mistake

    Follow us on

    Punjab Kings: గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి ఐపీఎల్ చాలా పెద్ద ఎత్తున ప్రేక్షకుల్ని అలరిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు మూడు నాలుగు సీజన్ల నుంచి హైదరాబాద్ టీమ్ సరైన పర్ఫామెన్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ ఈసారి మాత్రం దుమ్ము రేపుతుందనే చెప్పాలి.

    అందువల్లే ఐపిఎల్ సీజన్ కి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇదిలా ఉంటే పంజాబ్ టీం విషయానికి వస్తే ఈ టీంలో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్ళు టీమ్ ను గెలుపు దిశగా తీసుకెళ్ళలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ప్లేయర్లు సరిగ్గా సెట్ అవ్వడం లేదు. ఇంక దానికి తోడుగా పంజాబ్ టీమ్ కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా తను అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళ టీమ్ లో శిఖర్ ధావన్, బెయిర్ స్ట్రో లు బాగా ఆడితే వీళ్ళకి బ్యాటింగ్ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు.ఇక వీళ్ళ తర్వాత ప్రభూ సిమ్రాన్, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్ లు ఉన్నారు. ఇక వీళ్లలో ప్రభు సిమ్రాన్ ఆశించిన మేరకు రాణించడం లేదు. అలాగే జితేష్ శర్మ నుంచి కూడా ఇంకా బెటర్ పర్ఫామెన్స్ అయితే రావాలి. అలా వస్తేనే పంజాబ్ టీం భారీ స్కోర్ అయితే చేయగలుగుతుంది.

    వీళ్ళు బ్యాటింగ్ పరంగా స్ట్రాంగ్ గా లేకుంటే మాత్రం పంజాబ్ టీం ఇక మీదట జరిగే మ్యాచ్ లో గెలవడం చాలా కష్టం అవుతుంది. అలాగే వీళ్లు అశుతోష్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుతున్నారు. ఇలా అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పంజాబ్ టీం కి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే రబాడ, సామ్ కరణ్ చాలా వరకు మంచి స్పెల్ అయితే వేయగలుగుతున్నారు. ఇక హర్షల్ పటేల్ చాలా ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు. ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి అంటే బౌలింగ్ లో రబాడ, సామ్ కరణ్ వాళ్ల ఓవర్లను మొదట్లోనే ఫినిష్ చేస్తున్నారు.

    ఇక చివర్లో బౌలింగ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల లివింగ్ స్టోన్ లాంటి ప్లేయర్ తో స్పిన్ బౌలింగ్ వేయిస్తున్నారు. అది ఒకటి రెండుసార్లు వర్కౌట్ అవ్వచ్చు. కానీ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయి ముందుకు సాగడం అనేది కరెక్ట్ కాదు. ఇక గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ఇదే ప్రాబ్లం ఎదురైంది. మొదట్లోనే రబాడ, సామ్ కరణ్ వాళ్ల ఓవర్లని వేయడం వల్ల చివర్లో వాళ్లకి సరైన బౌలర్లు దొరకలేదు. దానివల్ల వీళ్ళు ఆ మ్యాచ్ ను చేజేతులారా ఓడిపోవాల్సి వచ్చింది… ఇక ఇప్పటికైనా ఈ మైనస్ పాయింట్స్ ని గుర్తించి వాటిని ప్లస్ గా మార్చుకుంటే వచ్చే మ్యాచ్ లో పంజాబ్ టీం కి చాలా వరకు ప్లస్ అవుతుంది…