https://oktelugu.com/

Vishal: విశాల్ పెళ్లి చేసుకోకపోవడానికి ప్రభాస్ కి సంబంధం ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశాల్ రత్నం సినిమా రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మీ పెళ్లెప్పుడు అని అడిగినప్పుడు విశాల్...

Written By:
  • Gopi
  • , Updated On : April 18, 2024 / 02:17 PM IST

    Vishal interesting comments on his marriage

    Follow us on

    Vishal: సినిమా హీరోల పెళ్లి విషయంలో తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అందరికీ కనిపించే సెలబ్రిటీలు వాళ్లే కాబట్టి వాళ్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పటికే తెలుగులో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ పెళ్లి చేసుకున్నారు. ఒక ప్రభాస్ ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ గత సంవత్సరం ఒక ఇంటి వాళ్ళు అయ్యారు.

    ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశాల్ రత్నం సినిమా రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మీ పెళ్లెప్పుడు అని అడిగినప్పుడు విశాల్ ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఇక దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి కూడా తెరపైకి వచ్చింది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నాడు అనే విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభాస్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నాడే తప్ప పెళ్లి మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.

    అసలు ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదంటే సింగిల్ గానే ఉండిపోవాలనుకుంటున్నాడా అనే అనుమానులు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇంతకుముందు ప్రభాస్ అన్ స్టాపబుల్ షో కి వచ్చినప్పుడు బాలయ్య ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు అందరిని పెళ్లెప్పుడు అని అడిగితే ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత అని అంటున్నారు. మరి నీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే ప్రభాస్ ఫన్నీగా సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాత అని చెప్పాలేమో అంటూ సమాధానం ఇచ్చాడు. నిజానికి ప్రభాస్ ఇప్పుడప్పుడే ఇంక పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లో లేనట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే పెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసమే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. తప్ప పెళ్లి విషయం అనేది ఎక్కడా కూడా తీసుకురావడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఒంటరిగానే తన లైఫ్ ను లీడ్ చేయాలని చూస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు మాత్రం విశాల్ చెప్పిన సమాధానానికి ప్రభాస్ తో నీకు సంబంధం ఏంటి బ్రదర్ మీ పెళ్లి మీరు చేసుకొండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు…