Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాలుగా చెరగని ముద్ర వేసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ, కొత్త హీరోలు వచ్చినప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ గా కొనసాగుతున్న ఒకే ఒక్క హీరో చిరంజీవి…ఆయనను మించిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని వందల పాత్రల్లో నటించి మెప్పించాడు.
ఇక ప్రస్తుతం ఆయన 68 సంవత్సరాల వయసు లో ఉన్నప్పటికీ ఆయన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా తన సినిమాలన్నింటిని ఒకటికి పది సార్లు చూస్తూ వచ్చేవాడట. ఇక ఆయన చేసిన సినిమాల్లో “గ్యాంగ్ లీడర్” సినిమా అంటే సందీప్ కి చాలా ఇష్టమట. ఆ సినిమాలోని పాటలైనా, ఫైట్స్ అయిన, చిరంజీవి యాక్టింగ్ అయిన కూడా నాకు చాలా ఇష్టం అని తనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం…
ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ సినిమాలో చిరంజీవి ఒక సీన్ లో ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడో కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే ఒక సినిమాని ఆయన ఎంత డీప్ గా లీనమైపోయి చూస్తూ ఉంటాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఆయన పాత్ర అంటే చాలా ఇష్టమట, ఆ క్యారెక్టర్ ఎవరికి భయపడకుండా తను అనుకున్నది సాధించాలనుకునే పాత్ర కాబట్టి తన సినిమాలో దాని తాలూకు కొన్ని షేడ్స్ ని ఇన్ క్లూడ్ చేసుకుంటూ తన క్యారెక్టర్స్ ను డిజైన్ చేసుకుంటానని సందీప్ రెడ్డి వంగా ఒకానొక టైం లో చెప్పడం విశేషం.
ఇక అందుకే సందీప్ కి గ్యాంగ్ లీడర్ సినిమాకి మధ్య ఒక మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు దాదాపు ఆయన ఒక 200 లకు పైన ఈ సినిమాను చూసి ఉంటాడని చెప్పాడు. ఇక కమర్షియల్ సినిమా అంటే గ్యాంగ్ లీడర్ సినిమానే అని ఆయన ఒక సందర్భంలో తెలియజేశాడు. అంటే మొత్తానికైతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను కూడా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు…