Priyansh Arya : నాడు బాధిత పక్షంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య.. నేడు ఒక్కసారి గా హీరో అయిపోయాడు. చండీగఢ్ లో చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. ముఖ్యంగా ధోని శిష్యుడు మతిష పతిరణ బౌలింగ్ లో ఆకాశమే హద్దుగా చదివిపోయాడు. ఓపెనర్ గా వచ్చిన ప్రియాన్ష్ సహచర ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ.. ఒక్కడిగా నిలబడ్డాడు.. చెన్నై ఎదుట పంజాబ్ జట్టు 222 స్కోర్ టార్గెట్ విధించగా.. అందులో సగం పరుగులు ప్రియాన్ష్ ఆర్య చేసినవే అంటే.. అతడు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మతిషా పతిరణ బౌలింగ్లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. వరుసగా మూడు బంతులను సిక్సర్లుగా కొట్టాడు. మరో బంతిని బౌండరీకి తరలించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 22 పరుగులు సాధించి.. 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ జట్టు ప్రియాన్ష్ ఆర్య ను అన్ క్యాప్డ్ ఆటగాడిగా తీసుకుంది. మెగా వేలంలో ఇతడిని 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాన్ష్ ఆర్య పది మ్యాచ్ లు ఆడి.. 198.69 స్ట్రైక్ రేట్.. 67.56 సగటుతో 608 రన్స్ చేశాడు.
Also Read : నాలుగు బంతుల్లో 22 రన్స్.. కట్ చేస్తే సూపర్ సెంచరీ..
ఆరు బంతులకు ఆరు సిక్సర్లు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్- 2024 లో ఇతడు ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు.. అయితే ఆ సిక్సర్లు మొత్తం బౌలర్ తల మీదుగానే కొట్టాడు. ఇక ఆ మ్యాచ్ లోకి కేవలం 50 బంతుల్లోనే 10 సిక్సర్ల సహాయంతో 120 పరుగులు చేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ప్రపంచానికి పరిచయమైంది.. అతడి దూకుడు చూసిన పంజాబ్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ మెగా వేలంలో 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. అతడికి అంత ధర చెల్లించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతడు ఎంత విలువైన ఆటగాడో ఇప్పుడు తెలిసి వస్తోంది. పంజాబ్ ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టోయినీస్(4), మాక్స్ వెల్(1), నెహల్ వదేరా (9) వంటి భీకరమైన ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. ప్రియాన్ష్ ఒక్కడే జట్టు భారాన్ని మొత్తం మోసాడు.. ఏకంగా 103 పరుగులు చేసి పంజాబ్ జట్టును పడిపోకుండా కాపాడాడు. ఇక మరో ఆటగాడు శశాంక్ సింగ్(52), మార్కో జాన్సన్ (34) ఆకట్టుకోవడంతో పంజాబ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎదుట 222 పరుగుల టార్గెట్ ను ఉంచగలిగింది.
Also Read : లక్నో 238 కొట్టినా.. ఇదే హైయెస్ట్ కాదు.. గతంలో ఎవరి మీద చేసిందంటే..