US Student Visa
US Student Visa : అమెరికాలోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలని.. ప్రపంచస్థాయి కంపెనీలలో పనిచేయాలని.. నాలుగు డాలర్లు వెనుకేసుకోవాలని భావిస్తుంటారు. దీనికోసం ఎంత కష్టమైనా పడుతుంటారు. అయితే మొదట్లో దీనిని అమెరికా ప్రోత్సహించేది. తమ దేశంలో నాణ్యమైన మానవ వనరులు ఉండేలా చూసుకునేది. అయితే రాను రాను పరిస్థితి తారు మారయింది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడంతో.. స్వదేశంలో ఉన్న వారికి ఉద్యోగాలు లభించడం తగ్గిపోయింది.అమెరికా దేశస్థులతో పోల్చితే ఇతర దేశాల చెందినవారు ఎక్కువగా పని చేయడం.. కష్టపడి పని చేయడం.. నాణ్యంగా పనిచేయడంతో.. సహజంగా అమెరికా దేశస్థులు నిరసన మొదలైంది. ఇక విశ్వవిద్యాలయాల గురించి ప్రస్తావిస్తే.. ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులతో అమెరికా విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు. విదేశీ విద్యార్థుల మాదిరిగా చదవలేక పోతున్నారు. ఇది సగటు అమెరికన్లకు ఇబ్బందికరంగా మారింది. ఇది ఎన్నికల సమయంలో ట్రంప్ కు ప్రచార ఆస్త్రం అయిపోయింది. అంతేకాదు మరో మారు అమెరికాను గొప్పగా నిలబెడతానని అతడు వాగ్దానం చేయడంతో.. అమెరికా దేశస్థులు మొత్తం ట్రంప్ కు జై కొట్టారు. ఇప్పుడు ట్రంప్ కొరడా దెబ్బలను ప్రపంచ దేశాల వారికి రుచి చూపిస్తున్నాడు. చిన్న కారణం ఉన్నా చాలు.. విదేశీ విద్యార్థులను రాత్రికి రాత్రే వారి సొంత దేశాలకు పంపించే ప్రణాళిక రూపొందిస్తున్నాడు. అంతేకాదు ఏకంగా వీసాల రద్దు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ట్రంప్. దీంతో భారతీయ విద్యార్థులే కాదు.. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Also Read : ట్రంప్ విధానాల గండం.. తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళన!
షరతులు వర్తిస్తాయి
అమెరికాలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (SEVP) అనేది ఉంటుంది. దీని ప్రకారం అమెరికా ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో పూర్తి సమయం చదువుకోవాల్సి ఉంటుంది. దీనిని ఎఫ్ -1 వీసా అనుమతిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి అనేక షరతులు విధించారు.. గతంలో అవసరమైన కోర్స్ కంటే తక్కువ సమయం చదివితే వీసాను రద్దు చేసేవారు. అయితే సంబంధిత విశ్వవిద్యాలయ అధికారి ఆమోదిస్తే తప్ప వీసాను రద్దు చేసేవారు కాదు. ఇక ఇప్పుడు చిన్న చిన్న క్రమశిక్షణ రహిత కారణాలను కూడా సాకుగా చూపించి వీసాను రద్దు చేస్తున్నారు. పార్ట్ టైం, హైబ్రిడ్ లేదా ఆన్లైన్ వంటి కోర్స్ ఫార్మాట్లో మార్పులు SEVI కి లోబడి లేకపోతే వీసాను రద్దు చేస్తున్నారు.. సరైన కర్కులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటివి విశ్వవిద్యాలయాల అధికారుల ఆమోదం లేకుండా చేస్తే వీసా రద్దు చేస్తున్నారు.. ముఖ్యంగా పరిశోధన, రక్షణ లేదా విదేశీ నిధుల వంటి రంగాలలో పనిచేస్తున్న వారు లేదా ఇంటర్ను షిప్ లో ఉన్నవారు ఎక్కువగా వీసా రద్దు స్థితిని ఎదుర్కొంటున్నారు.. ఇక వివిధ విశ్వవిద్యాలయాలో చదువుకునేవారు తమ ఆర్థిక పరిస్థితిని ప్రదర్శించే విషయంలో విఫలమైతే అది వీసా రద్దుకు దారితీస్తోంది. అడ్మిషన్ లెటర్లు, పరీక్ష స్కోర్ లు, ఆర్థిక పత్రాలు తారుమారు చేసినా, నకిలీ సమాచారం అందించినా వెంటనే వీసాలు రద్దు చేస్తున్నారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన నిబంధనలను విధిస్తున్నాడు. అక్కడ పరిస్థితులు మారిన నేపథ్యంలో కొత్త విధానాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల వల్ల అమెరికాలో ఉంటున్న భారతీయుల జీవన వ్యయం పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. దీంతో భారతీయులు అనేక సవాలు ఎదుర్కొంటున్నారు. ఇక కొంతమంది విద్యార్థుల వీసాలనైతే చిన్నచిన్న కారణాలతో రద్దు చేస్తున్నారు. వేగంగా వాహనాలు నడిపారని.. లేదా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కారణాలుగా చూపుతూ వీసాలను రద్దు చేస్తున్నారు. దీంతో విదేశీ విద్యార్థులు అమెరికాలో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ” ఎప్పుడు వీసా రద్దు అవుతుందో అర్థం కావడం లేదు. నిత్యం భయంతో ఉండాల్సి వస్తోంది. ఏం జరుగుతుందో ఇంతకీ అందు పట్టడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే నరకం కనిపిస్తోందని” పేరు రాసేందుకు ఇష్టపడని ఓ విద్యార్థి తన ఆవేదన వ్యక్తం చేశాడు..” నాతో పాటు చదువుకునే ఓ స్నేహితుడు వేగంగా వాహనం నడిపాడు. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనకు కారణమయ్యాడు. దీంతో అతడి వీసాను తొలగించారు. ఫలితంగా అతడు స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని” భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన యువకుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాల విద్యార్థుల పరిస్థితి అమెరికాలో ఇదేవిధంగా ఉంది. ముఖ్యంగా భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటేనే బాగుంటుందని భారతీయ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ట్రంప్ సుంకాల దెబ్బ.. చమురు ధరల పతనం!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Us student visa why usa is revolving student visas overnight what happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com