Praful Hinge four wickets: ఐపీఎల్ లో ఓవర్ నైట్ స్టార్ లు పుట్టుకు రావడం అనేది కొత్తేమీ కాదు. కాకపోతే దానిని నిలబెట్టుకోవడం ఆటగాళ్ల సమర్ధత మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా హైదరాబాద్ జట్టు నుంచి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు ప్రఫుల్ హింజ్. విదర్భ క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఈ ఆటగాడు.. సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ లేమి తో బాధపడుతున్న హైదరాబాద్ జట్టుకు.. ఆపద్బాంధవుడిగా నిలిచాడు.
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టి.. అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు, తన వైవిధ్యమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. అందువల్లే ఇతడు ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. రాజస్థాన్ జట్టుమీద నాలుగు వికెట్లు తీసిన తర్వాత ప్రఫుల్ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో అతడిని గతంలో 9,064 మంది అనుసరించారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 60,000 కు మించిపోయింది. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది.
” అతడు గొప్పగా బౌలింగ్ చేసిన తర్వాత అభిమానులు కూడా తమ స్థాయి ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల మధ్యలో స్థిరమైన స్థానాన్ని అందుకుంటాడు.. ప్రఫుల్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అందుకు నిదర్శనమే ఇంతమంది ఫాలోవర్స్ .. అతడు ఇదే స్థాయిలో బౌలింగ్ చేస్తే మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తాడు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.. పైగా అతని వయసు కూడా చాలా తక్కువ.. అందువల్ల ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు అతడికి ఉంది. దానిని అతడు కొనసాగించాలని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు కు బలమైన బౌలింగ్ లేదు. భారీగా పరుగులు చేసినప్పటికీ వికెట్లు తీసే సత్తా లేకపోవడంతో హైదరాబాద్ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. అయితే ఈసారి హైదరాబాద్ జట్టు రాతను ప్రఫుల్ పూర్తిగా మార్చేశాడు. తన బౌలింగ్ స్టైల్ తో అదరగొట్టాడు. నాలుగు వికెట్ల పడగొట్టి హైదరాబాద్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని మాత్రమే కాదు.. తనకంటూ గొప్ప పేరును చరిత్రలో రాసుకున్నాడు.
