Nithya Menen: హీరోయిన్ నిత్యామీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం నటిగా రాణిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరు. మలయాళం లో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ను ప్రారంభించిన నిత్యామీనన్ ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో, క్యూట్ పెర్ఫార్మెన్స్ తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. ఆ తర్వాత నిత్యా మీనన్ తెలుగులో సెగ,180 వంటి పలు సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నిరాశ పరిచినప్పటికీ ఆ తర్వాత హీరో నితిన్ కు జోడిగా ఇష్క్ సినిమాలో నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇక ఈ సినిమాలోని పాటలు అన్ని కూడా ఇప్పటికి అందరికి ఇష్టం. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈమె తెలుగుతోపాటు మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యామీనన్ కు సినిమాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అటువంటి ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. ఇటీవలే హీరోయిన్ నిత్యామీనన్ కు తమిళ్ లో నటించిన తిరు సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమాలతో పాటు నిత్యామీనన్ నిర్మాతగా కూడా పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. అలాగే ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బుల్లితెర మీద కూడా ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రస్తుతం బిజీగా మారిపోయారు.
తాజాగా నిత్యామీనన్ నటించిన సినిమా కాదలిక నేరమెల్లై త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఈమె తన కెరీర్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదని నిత్యామీనన్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఆ ఒత్తిడిని భరించడం చాలా కష్టమైన పని, అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలని భావించాను అంటూ తెలిపారు.
ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి తాను ఇష్టపడతానని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని అనుకుంటున్నాను అంటూ నిత్యామీనన్ తెలిపారు. అలా ఆలోచిస్తున్నా నన్ను నేషనల్ అవార్డు పూర్తిగా మార్చేసింది అంటూ తెలిపారు. నేషనల్ అవార్డు రావడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అన్న ఆలోచనను తను మార్చుకున్నట్టు నిత్యామీనన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవార్డు నాకు రావడం పట్ల నటిగా మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.