Pat Cummins: అతడు మోపయ్యాడు, దురదృష్టం జతకలిసింది.. అందుకే ఓడిపోయాం

నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయిన తర్వాత ఆ చెట్టు కెప్టెన్ కమిన్స్ స్పందించాడు. "బౌలింగ్ లో మా వాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. బ్యాటింగ్ కూడా బాగానే చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 8:30 am

Pat Cummins

Follow us on

Pat Cummins: గెలుపు ముంగిట బోల్తాపడటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై అభిమానుల నుంచి ఆగ్రహంతో పాటు సానుభూతి కూడా వ్యక్తమౌతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ 17 వ సీజన్ లో మొదటి రెండు మ్యాచ్ లు చప్పగా సాగాయి. కానీ శనివారం రాత్రి కోల్ కతా, హైదరాబాద్ అసలు సిసలైన టి20 మజా ప్రేక్షకులకు అందించింది.. అయితే ఇక్కడ హైదరాబాద్ ఓడిపోవడాన్ని తెలుగు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలుపు ముంగిట నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ తట్టుకోలేకపోతున్నాడు.

నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయిన తర్వాత ఆ చెట్టు కెప్టెన్ కమిన్స్ స్పందించాడు. “బౌలింగ్ లో మా వాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. బ్యాటింగ్ కూడా బాగానే చేశారు. కానీ దురదృష్టం మా వెంట ఉంది. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు పదునైన బంతులు చేశారు. మాకు రస్సెల్ మోపయ్యాడు. తనదైన శైలిలో చెలరేగిపోయాడు. దానికి దురదృష్టం కూడా తోడైంది. అందువల్లే మేము ఓడిపోవలసి వచ్చింది. మా వరకు మేము మెరుగైన ప్రదర్శన చేయాలని కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని దాదాపుగా అమలు చేసాం. కానీ రస్సెల్ అలా మొండిగా నిలబడితే ఎవరైనా బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడు అత్యంత క్లిష్టమైన షాట్స్ ఆడాడు. అలాంటి పరిస్థితుల్లో మా బౌలర్లు ఇంకా అద్భుతమైన బంతులు వేస్తే ఇంకా బాగుండేది. క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. షేహబాజ్ అతడికి తోడ్పాటు అందించాడు. వారిద్దరూ మా జట్టును గెలుపు వాకిట్లోకి తీసుకొచ్చారు. వెంట్రుకవాసిలో మాకు విజయం అందలేదు. అన్ని దశల్లోనూ మా స్థాయి ప్రదర్శన చేశామని” కమిన్స్ వ్యాఖ్యానించాడు.” కోల్ కతా కు సొంత మైదానం కావడంతో వారికి చాలా వరకు అంశాలు కలిసి వచ్చాయి. టాస్ గెలవడం కూడా వారి పాలిట వరమైందని” కమిన్స్ అన్నాడు.

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు తరఫున హెన్రీ క్లాసెన్ వీరోచిత బ్యాటింగ్ చేశాడు. (29 బంతుల్లో 8 సిక్స్ ల సహాయంతో 63 పరుగులు చేశాడు) అయినప్పటికీ చివరి 5 బంతుల్లో హైదరాబాద్ జట్టు ఏడు పరుగులు సాధించలేకపోయింది.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆండ్రూ రస్సెల్( 25 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్స్ లతో 64 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు మాత్రమే చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అండ్రు రస్సెల్ కు లభించింది. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ లో అనూహ్యమైన ఫలితం రావడంతో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ నిరాశలో మునిగిపోయింది. అప్పటిదాకా తన జట్టు గెలుస్తుందని ఆమె ఎగిరి గంతేసింది. కానీ చివరికి హైదరాబాదు గెలుపు ముందు ఓడిపోవడంతో బాధలో కూరుకుపోయింది. నెటిజన్లు ఆమె హావాభావాల తాలూకూ వీడియోలు, ఫోటోలు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.