IPL 2024 SRH Vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గెలుపు ముంగిట ఒత్తిడికి గురి కావడంతో హైదరాబాద్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసింది. క్లాసెన్(63) పరుగులు చేసినప్పటికీ హైదరాబాద్ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. చివరి నిమిషంలో అతడు క్యాచ్ అవుట్ కావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ జాతకం తారు మారయింది.
అంతకుముందు రాహుల్ త్రిపాఠి అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 సిక్స్ లతో 63 పరుగులు చేశాడు. అతడు హాఫ్ సెంచరీ సాధించడంతో హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, తన తండ్రి కళానిధి మారన్ తో కలిసి కేరింతలు కొట్టింది. క్లాసెన్ కూడా మంచి దూకుడు మీద ఉండటంతో.. హైదరాబాద్ జట్టు ఎలాగైనా గెలుస్తుందని కావ్య భావించింది. హైదరాబాద్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ క్లాప్స్ కొట్టింది.
19 ఓవర్లో వీర విహారం ద్వారా క్లాసెన్ హైదరాబాద్ జట్టును విజయానికి దగ్గరగా చేర్చాడు. కానీ అతడు క్యాచ్ అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో హైదరాబాద్ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ పై సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేస్తున్నాయి. 19.1 ఓవర్లో క్లాసెన్ కొట్టిన సిక్సర్ తో లియో సినిమాలో విజయ్ లాగా హైదరాబాద్ జట్టు ఓనర్ ఎగిరి గంతేసిందని…19.5 ఓవర్ కు వచ్చేసరికి విలన్ల చేతిలో దెబ్బలు తిన్న విజయ్ లాగా అయిపోయిందని ఓ నెటిజన్ మీమ్ రూపొందించాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. “కావ్య పాప ఓడిపోయి బాధలో ఉంటే.. తమిళ హీరో విజయ్ తో ఈ మాస్ ర్యాగింగ్ ఏమిటని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Just how fast the night changes?
Kavya Maran always having the bad luck #KKRvsSRH IPL is IPLing pic.twitter.com/LmvNnkXmRd— Abel (@weekndtweets) March 23, 2024
Kavya Maran #KKRvsSRH https://t.co/vYBGtOav0f
— Immy|| (@TotallyImro45) March 23, 2024