https://oktelugu.com/

Devara: రామ్ చరణ్ డిజాస్టర్ ఫ్లాప్ ‘జంజీర్’ ని దాటలేకపోయిన ఎన్టీఆర్ ‘దేవర’..సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్!

కమర్షియల్ గా భారీ డిజాస్టర్ గా నిల్చిన ఈ చిత్రం, ఆరోజుల్లో హిందీలో పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. డిజాస్టర్ టాక్ తో ఆ మాత్రం వసూళ్లు ఆరోజుల్లో రావడం చాలా గొప్ప. సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే అప్పట్లోనే వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ఉండేది ఈ సినిమా.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 05:09 PM IST

    Devara(8)

    Follow us on

    Devara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలలో ఒకటిగా నిల్చిన చిత్రం ‘జంజీర్’. అప్పట్లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ కి ఈ సినిమా రీమేక్. తెలుగు లో ‘తుఫాన్’ పేరిట విడుదలైంది. ఇక్కడ కూడా పెద్ద ఫ్లాప్. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ చిత్రం పై అంచనాలు భారీ గా ఉండేవి. రామ్ చరణ్ కి ‘మగధీర’ సినిమా ద్వారా నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా హిందీ వెర్షన్ థియేటర్స్ లో విడుదల కాకపోయినా, టీవీ టెలికాస్ట్ లో బంపర్ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ పేరు మారుమోగింది. హిందీ లో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. అలా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రామ్ చరణ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

    కమర్షియల్ గా భారీ డిజాస్టర్ గా నిల్చిన ఈ చిత్రం, ఆరోజుల్లో హిందీలో పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. డిజాస్టర్ టాక్ తో ఆ మాత్రం వసూళ్లు ఆరోజుల్లో రావడం చాలా గొప్ప. సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే అప్పట్లోనే వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ఉండేది ఈ సినిమా. అయితే అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం, రామ్ చరణ్ ‘జంజీర్’ ని దాటలేకపోయింది అంటూ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ ‘జంజీర్’ చిత్రం బాలీవుడ్ లో మొదటి వారం 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. కానీ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి ప్రీ రిలీజ్ హిందీ వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 15 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది అంటూ సోషల్ మీడియా లో కాసేపటి క్రితమే ఒక వార్త ప్రచారం లోకి వచ్చింది.

    దీనికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘మా హీరో డిజాస్టర్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అంత కూడా మీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు’ అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువకు జరిగినప్పటికీ, సరైన టాక్ వస్తే కేవలం మొదటి రోజులోనే 70 శాతం కి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని రికవర్ చేసే సత్తా మా ఎన్టీఆర్ కి ఉందంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఆ స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి. సెప్టెంబర్ 22 వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.