Virat Kohli-Babar Azam : పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది? విరాట్ తో బాబర్ ను పోల్చడం కూడా అలాంటిదే..పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

శునకం (కొన్ని రకాలు), సింహం ఒకే రంగులో ఉన్నంత మాత్రాన.. శునకం సింహం అవదు. ఎందుకంటే శునకం వీధిలో మాత్రమే మొరుగుతుంది. కానీ సింహం అడవిలో గర్జిస్తుంది. అడవిని మొత్తం పాలిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆగండాగండి అప్పటిదాకా వస్తున్నాం.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 10:35 am

Virat Kohli-Babar Azam

Follow us on

Virat Kohli-Babar Azam :  ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మైదానంతో సంబంధం లేకుండా పరుగులు తీస్తున్నాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా దూకుడుగా ఆడుతున్నాడు. ఫామ్ తో సంబంధం లేకుండా మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. అందుకు ఉదాహరణ t20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. అప్పటిదాకా అతడు ఒక్క మ్యాచ్ లో కూడా దీటైన ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ ఫైనల్ లో మ్యాచ్ లో సహచర ఆటగాళ్లు అవుట్ అవుతున్నప్పటికీ.. ధాటిగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. ఫలితంగా టీమ్ ఇండియా గెలిచింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత పొట్టి క్రికెట్ కప్ దక్కించుకుంది. అయితే స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు దగ్గరగా వచ్చాడు. హైయెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. త్వరలో మూడో స్థానానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని కొంతమంది పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ తో పోల్చుతున్నారు. ఇది సహజంగానే టీమిండియా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే ఇది పాకిస్తాన్ మాజీ ఆటగాడు జహీర్ అబ్బాస్ కు కూడా కోపం తెప్పించింది.

“విరాట్ ఈ కాలంలో అసలు సిసలైన ఆటగాడు. అతడు ఎలాంటి స్థితిలోనైనా బ్యాటింగ్ చేస్తాడు. అద్భుతాలను ఆవిష్కరిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోడు.. అసలు అతడితో బాబర్ ఆజాం ను పోల్చడం నాకైతే నచ్చడం లేదు. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాదు కదా.. బాబర్ అతను ఆడిన మ్యాచ్లలో పెద్దగా స్కోర్ చేయలేడు. విరాట్ తో అతడు సరితూగలేడు. వర్ధమాన క్రికెట్లో ఎవరు గొప్పగా బ్యాటింగ్ చేస్తే అతడే అద్భుతమైన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటికే 80 శతకాలు చేశాడు. బాబర్ అజాం మాత్రం 31 సచ్చిరెడ్డి మాత్రమే అమలు చేశాడు. ఒకప్పుడు బాబర్ అద్భుతంగా ఆడేవాడు. విరాట్ కోహ్లీ, స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్లతో ఫ్యాబ్ 5లో ఉండేవాడు. ఇప్పుడు తన ఆటతీరుతో జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడని” అబ్బాస్ వ్యాఖ్యానించాడు.

“రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. అన్ని విభాగాలలో పట్టిష్టంగా కనిపిస్తోంది. బ్యాటర్లు తిరుగులేని ఫామ్ కనబరుస్తున్నారు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టీం అన్ని విభాగాలలో పరిపుష్టంగా కనిపిస్తోంది. అనుకూలంగా జరుగుతుంది కాబట్టి వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా భారతదేశ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని ఫార్మాట్లో ఆడినప్పటికీ టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటితేనే ఒక ఆటగాడి ప్రతిభ, నైపుణ్యం, అతడి సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తాయి. ఆటగాళ్లు ఎన్ని టీ20లు ఆడినప్పటికీ.. ఎన్ని వన్డేలలో సత్తా చాటినప్పటికీ చివరికి టెస్ట్ క్రికెట్ కు రావాల్సిందే. ఇక్కడే అసలైన క్రికెట్ మజా లభిస్తుంది. అయితే అలాంటి క్రికెట్ టీమ్ ఇండియా ఆడుతోంది.. జిడ్డు అనే పదాన్ని పక్కన పెట్టి.. బజ్ బాల్ కు మించి టెస్ట్ క్రికెట్ కు నగీశీలు అద్దుతోందని” అబ్బాస్ వ్యాఖ్యానించాడు.