Actor Govinda: నటుడు గోవింద అనుకోని ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయన నివాసంలో గన్ మిస్ ఫైర్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోవింద కలకత్తా వెళ్లాల్సి ఉండగా ముంబైలోని తన నివాసం నుండి మంగళవారం బయలుదేరారు. తన లైసెన్స్డ్ గన్ బయటకు తీశారు. అది చేతి నుండి జారి కింద పడిందట. దాంతో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. గోవింద కాల్లోకి ఓ బుల్లెట్ దూసుకెళ్ళిందట.
గోవింద కాలికి తీవ్ర గాయం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. గోవింద శరీరం నుండి బుల్లెట్ తొలగించారు వైద్యులు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు గోవింద ఆసుపత్రిలో ఉంటారని మేనేజర్ తెలిపారు. గోవింద ప్రమాదానికి గురయ్యాడన్న వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. మేనేజర్ ప్రకటనతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
90లలో గోవిందా స్టార్ హీరోగా వెలుగొందారు. కామెడీ చిత్రాల హీరోగా ఆయనకు పేరుంది. గోవింద మంచి డాన్సర్. అమ్మాయిల్లో గోవిందకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. 1986లో సినీరంగ ప్రవేశం చేశాడు. లవ్ 86 ఆయన డెబ్యూ మూవీ. జాన్ సే ప్యారా, దులారా, ఖుద్దర్, ఆందోళన్ చిత్రాలు గోవిందకు స్టార్డం తెచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి. గోవింద సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. 2019లో వచ్చిన రంగీలా రాజా ఆయన చివరి చిత్రం.