Odi World Cup 2023: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ మీద ఘన విజయాన్ని సాధించింది. ఇక అందులో భాగంగానే ఇండియా వరుసగా ఆరోవ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ క్రమంలోనే ఇండియా సెమి ఫైనల్ కు కూడా చేరుకోవడం జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ టీం వరుస విజయాలను అందుకోవడం లో ఇండియన్ టీమ్ ప్లేయర్ల కృషి చాలా వరకు ఉందనే చెప్పాలి.ఇక అందరూ కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ చాలా బాగా ఆడుతున్నారు.
అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ఇండియా విజయం సాధించడం తో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.అది ఏంటి పాకిస్తాన్ జనాలు వాళ్ల మ్యాచ్ గెలవకపోయిన పర్లేదు కానీ ఇండియా మాత్రం మ్యాచ్ లు గెలవకూడదు , కప్పు కొట్టకూడదు అని దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారు అలాంటి క్రమంలో ఇంగ్లాండ్ మీద ఇండియా గెలిచినందుకు పాకిస్తాన్ అభిమానులు ఇండియన్ టీం కి థాంక్స్ చెప్తూ సంబరాలు చేసుకుంటున్నారు అనే న్యూస్ నిన్నటి నుంచి నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. అదేంటి ఇండియా మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ జనాలు సంబరాలు చేసుకోవడం ఏంటి అనే డౌట్ అందరిలో కలుగుతుంది. వాళ్లు సంబరాలు చేసుకునేది మన టీం గెలిచినందుకు కాదు ఇంగ్లాండ్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం 6 మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి మిగిలిన 5 మ్యాచ్ ల్లో ఓడిపోవడం జరిగింది. ఇక సెమిస్ బెర్త్ కోసం ఇండియా, న్యూజిలాండ్ ,సౌతాఫ్రికా టీం లు ఆల్రెడీ సెమీ ఫైనల్ కి చేరుకోగా మిగతా ఒక్క ప్లేస్ కోసం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ,ఇంగ్లాండ్ , ఆఫ్గనిస్తాన్ లాంటి టీమ్ లు ఇప్పుడు పోటీ పడుతున్నాయి ఇక ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ టీం ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో మూడింటికి మూడు గెలిచినా కూడా వాళ్లకి ఎనిమిది పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ టీమ్ మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది పాకిస్తాన్ టీమ్ మూడుకి మూడు మ్యాచ్ లు గెలిస్తే వాళ్లకు 10 పాయింట్లు వస్తాయి. ఇండియా మీద ఇంగ్లాండ్ ఆడిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోవడం మంచిదైందని పాకిస్తాన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇండియా మీద ఇంగ్లాండ్ గెలిచి, ఆ తర్వాత ఆడే మూడు మ్యాచ్ ల్లో కూడా గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్ పాకిస్తాన్ రెండు టీమ్ లు కూడా 10 పాయింట్ల తో సమానంగా ఉండేవి.ఇక దాని ద్వారా రన్ రేట్ ని బేస్ చేసుకుని ఒక టీమ్ కి సెమీస్ కి వెళ్లే అవకాశాలు ఉండేవి…
కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ ఇండియా మీద ఓడిపోవడంతో వాళ్లు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన కూడా 8 పాయింట్లు మాత్రమే సాధిస్తారు. ఇక పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో గెలిచినట్టయితే 10 పాయింట్లు సాధిస్తుంది కాబట్టి ఇంగ్లాండ్ కంటే పాకిస్తాన్ కి సెమిస్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్లు ఇండియా గెలుపుని సంబరాలుగా జరుపుకుంటున్నారు అంతే తప్ప ఇండియా మీద అభిమానంతో అయితే కాదు…మరి ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా టీం సెమీస్ ని కన్ఫామ్ చేసుకోగా మిగతా ఒక్క ప్లేస్ కి ఏ టీం వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది…