PAK vs NZ : డూనె డిన్ లోని ఓవల్ యూనివర్సిటీలో రెండవ టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కురవడంతో అంపైర్లు 15 ఓవర్ల పాటు మాత్రమే మ్యాచ్ నిర్వహించారు. నీతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్లు లాస్ అయి.. 135 రన్స్ చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా 46 పరుగులతో టాప్ స్కోరర్ గా గెలిచాడు. షాదాబ్ ఖాన్ 14 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 26 పరుగులు బాదాడు. ఇక చివర్లో వచ్చిన షాహిన్ 14 బంతుల్లో 22 రన్స్ చేసి ఆదరగొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫి, బెన్ సీవర్స్, ఇష్ సోది చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక పాకిస్తాన్ విధించిన 136 రన్స్ టార్గెట్ ను న్యూజిలాండ్ జట్టు 13.1 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఐదు వికెట్ లాస్ అయి ఈ టార్గెట్ చేజ్ చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సిఫర్డ్ 45, పిన్ అలెన్ 38 రన్స్ చేశారు.. మార్క్ చాప్ మన్(1), డారిల్ మిచెల్ (14), నీషమ్(5) విఫలమైనప్పటికీ.. బ్రేస్ వెల్(5*), మిచెల్ హే(21*) మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశారు.
Also Read : దేశం మారినా దారిద్య్రం మారలేదు.. పాపం పాకిస్తాన్.
ఒకే ఓవర్ లో మూడు సిక్స్ లు
ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ సీ ఫెర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఒకే ఓవర్ లో నాలుగు భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. షాహిన్ అఫ్రిది వేసిన రెండో ఓవర్ తొలి బంతిని సీ ఫెర్ట్ సిక్సర్ కొట్టాడు. ఇక ఇదే ఓవర్ రెండో బంతిని బ్యాక్ లెంగ్త్ దిశగా సీ ఫెర్డ్ సిక్సర్ కొట్టాడు. ఇక ఈ ఓవర్ లోని చివరి రెండు బంతులను సిక్సర్లు కొట్టడం విశేషం. మొత్తంగా సీ ఫెర్ట్ 22 బంతులను ఎదుర్కొని 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు ఉండడం విశేష. మరో ఓపెనర్ అలెన్ తో కలిసి తొలి వికెట్ కు అతడు 66 పరుగులు జోడించాడు. సీ ఫెర్ట్ ఉన్నంతసేపు మైదానంలో పరుగుల వరద పారించాడు. పాకిస్తాన్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఏ మాత్రం కనికరం లేకుండా కొట్టేశాడు. షాహిన్ ఆఫ్రిదికి నిద్రలేని రాత్రులను పరిచయం చేశాడు.. టి20 లలో ఇప్పుడిప్పుడే జోరు కొనసాగిస్తున్న సీ ఫెర్ట్.. పాకిస్తాన్ తో ఆడిన ఇన్నింగ్స్ తో జట్టులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శార్దూల్ ఠాకూర్
TIM SEIFERT SMASHING 4 SIXES IN AN OVER AGAINST SHAHEEN AFRIDI. pic.twitter.com/Q4jcTTW9Ar
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2025