PAK Vs NZ
PAK Vs NZ: పాకిస్తాన్ జట్టుకు దురదృష్టం జిడ్డు లాగా పట్టుకుంది. దారిద్ర్యం అలానే వెంటాడుతోంది. న్యూజిలాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ను ఓటమితో పాకిస్తాన్ జట్టు ప్రారంభించింది. రెండవ టి20 మ్యాచ్ లో కూడా ఓటమిపాలైంది. ఐదు వికెట్ల తేడాతో రెండో టి20 మ్యాచ్లో పరాజయం పాలైంది. దీంతో ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 2-0 తేడాతో సిరీస్ లో లీడ్ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు విఫల ప్రదర్శన చేసింది. లీగ్ దశలోనే ఇంటికి వచ్చింది. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్ లోనూ ఓడిపోయింది.
Also Read: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శార్దూల్ ఠాకూర్
అతడు మాత్రమే…
పాకిస్తాన్ ప్లేయర్లలో సల్మాన్ అఘా మాత్రమే పర్వాలేదనిపించాడు. 15 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా 28 బంతులు ఎదుర్కొనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. చివర్లో షాహిన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 22 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకోబ్ డఫీ, బెన్ సీవర్స్, నీషమ్ ఇష్ సోదీ తలా రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు.
5 వికెట్ల తేడాతో..
పాకిస్తాన్ విధించిన 136 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 13.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందించారు. టిమ్ సీఫర్డ్ 22 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అలెన్ 5 సిక్సర్లు కొట్టడం విశేషం. అలెన్, సీఫర్డ్ తొలి వికెట్ కు ఏకంగా 66 పరుగులు జోడించారు. మార్క్ చాప్ మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ తమ వంతు పాత్ర పోషించారు. మిచెల్ హే, బ్రేస్ వేల్ నాట్ అవుట్ గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లలో రౌఫ్ అండ్ వికెట్లు సాధించాడు. మహమ్మద్ అలీ, కుష్ దిల్ షాన్, జహనాద్ ఖాన్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే రెండవ టి20 మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మైదానం పై ఉన్న తేమను అంచనా వేసి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ యూనివర్సిటీ ఓవల్ లోని డ్యూనె డిన్ వేదికగా జరిగింది. మూడో టి20 మ్యాచ్ మార్చి 21 శుక్రవారం నాడు ఆక్ లాండ్ వేదికగా జరగనుంది. కాగా, క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలిచిన సంగతి తెలిసిందే.