PAK vs BAN : బంగ్లాదేశ్ జట్టుతో రావాల్సింది వేదికగా పాకిస్తాన్ జట్టు బుధవారం నుంచి తొలి టెస్ట్ మొదలుపెట్టింది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం కురిసినప్పుడు మైదానాన్ని సిద్ధం చేసే సహాయకులు లేకపోవడంతో.. పాకిస్తాన్ క్రికెటర్లు ఆ పని చేయాల్సి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తిట్టిన తిట్టు తిట్టకుండా నెటిజన్లు తిట్టి పడేశారు. ఆ తర్వాత మైదానంలో ఏర్పాటు చేసిన కుర్చీలపై కూడా మండిపడ్డారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వీసమెత్తు కూడా స్పందించలేదు. చివరికి ఎలాగోలా మ్యాచ్ మొదలైంది. వర్షం వల్ల తొలి రోజు మ్యాచ్ కేవలం 41 ఓవర్ల పాటే సాగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అవుట్ అయిన తీరు ఒకింత వివాదానికి కారణమైంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 158 రన్స్ చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. వర్షం పడి తగ్గిన తర్వాత మైదానం బౌలింగ్ కు సహకరించింది. దీనిని బంగ్లా బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. వాస్తవానికి ఒకానొక దశలో 16 పరుగులకే పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది.. అబ్దుల్లా షఫీ కి (2), షాన్ మసూద్ (3), బాబర్ అజాం (0) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఈ దశలో సౌద్ షకీల్ (52*), నయీం ఆయూబ్(56) పాకిస్తాన్ ఇన్నింగ్స్ భారాన్ని మోశారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 98 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ దశలో షాన్ మసూద్ ఔట్ కావడం చర్చకు దారి తీసింది. అంపైర్ అవుట్ ఇచ్చినప్పటికి.. తాను నాట్ అవుట్ అంటూ మసూద్ వారితో వాగ్వాదానికి దిగాడు..
బంగ్లా బౌలర్ ఇస్లాం వేసిన బంతిని మసూద్ డిఫెరెంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు విఫలమయ్యాడు. బంతి మసూద్ ప్యాడ్ – బ్యాట్ మధ్యలో నుంచి వెళ్ళింది. దానిని బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే దీనిని మొదట ఎంపైర్లు నాట్ అవుట్ గా ప్రకటించారు. దీంతో బంగ్లాదేశ్ సమీక్షకు వెళ్ళింది. ఈ రివ్యూ లో ఆల్ట్రా ఎడ్జ్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో అంపైర్ అవుట్ అని ప్రకటించాడు. అయితే బంతి ప్యాడ్ కు తగిలిందని, బ్యాట్ కు తగలలేదని మసూద్ వాదించాడు. తీవ్ర నిరాశ మధ్య మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మసూద్ పై మండిపడుతున్నారు. “బాబూ క్రికెట్ కాస్త జాగ్రత్తగా ఆడు. నాయనా ఇది గల్లి క్రికెట్ అనుకుంటున్నావేమో.. అంపైర్లతో వాగ్వాదానికి దిగి పరువు తీసుకుంటున్నావ్. ఆడుతోంది నీ సొంత దేశంలో అయినంత మాత్రాన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటావా” అంటూ నెటిజన్లు మసూద్ కు చురకలంటిస్తున్నారు.
Pad First Or Bat First ?
Shan Masood Was Out Or Not Out?
3rd Umpire Should Have Taken,
More Time To Take Decision?#PAKvsBAN #BANvsPAK #TestCricket #PakistanCricket pic.twitter.com/QVT3uQz1Nr— Addy Boss (@addy__boss) August 21, 2024