https://oktelugu.com/

Cristiano Ronaldo : ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర.. క్రీడా ప్రపంచంలో అరుదైన ఘనత..

ఆధునిక ఫుట్ బాల్ లో క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారు ఉండరు. అతడు మైదానంలోకి అడుగుపెడితే చాలు కేరింతలు కొడుతూ అభిమానులు సందడి చేస్తారు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. అటువంటి ఈ ఆటగాడు ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 22, 2024 / 12:28 PM IST

    Cristiano Ronaldo

    Follow us on

    Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో కు ప్రస్తుతం 39 సంవత్సరాలు. అయినప్పటికీ పోర్చుగీస్ జట్టుకు అసాధారణమైన విజయాలు అందించాడు. ఆధునిక ఫుట్ బాల్ చరిత్రలో పోర్చుగీస్ జట్టును చిరస్థాయిలో నిలబెట్టాడు. ప్రస్తుతమితడు సౌదీ అరేబియా క్లబ్ అల్ నా సర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఐదుసార్లు బాలన్ డీఓర్ విజేతగా నిలిచాడు. మైదానంలో చిరుత వేగంతో పరిగెత్తి.. ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై పదేపదే దాడి చేసే నైపుణ్యం క్రిస్టియానో రొనాల్డో సొంతం. అందువల్లే ఇతడిని ఫిలే వారసుడు అని పేర్కొంటుంటారు. ఎలాంటి మైదానమైనా, ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా..క్రిస్టియానో రొనాల్డో తనదైన రోజు శివాలూగిపోతాడు. అద్భుతమైన కిక్, నాక్ లతో గోల్స్ చేస్తాడు. రెప్పపాటు కాలంలో మ్యాచ్ స్వరూపం మార్చుతాడు. అలాంటి ఈ ఆటగాడు డిజిటల్ మీడియా లోనూ చెలరేగి పోతున్నాడు. సమకాలీన క్రీడా చరిత్రలో మరే ఆటగాడికి సాధ్యం కాని రికార్డు సృష్టించాడు.

     

    ఆగస్టు 21న UR Christiano పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్ ఏర్పాటు చేశాడు. ఐతే ఒక్క రోజులోనే 10 మిలియన్ల సబ్ స్క్రైబర్ లను రొనాల్డో సొంతం చేసుకున్నాడు. పైగా గోల్డెన్ బటన్ ను యూ ట్యూబ్ ను స్వీకరించాడు. రొనాల్డో వ్యక్తి గత జీవితానికి సంబంధించిన వీడియోలను ఇందులో పోస్ట్ చేశాడు. రొనాల్డో తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ తో సరదాగా ఆడిన క్విజ్, మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మైనపు బొమ్మకు సంబంధించిన వీడియోలను యూ ట్యూబ్ లో రొనాల్డో పోస్ట్ చేస్తాడు. చానెల్ ప్రారంభించిన 90 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో 1 మిలియన్ sub sribers ను రొనాల్డో సొంతం చేసుకున్నాడు. కేవలం ఆరు గంటల వ్యవధిలో ఆరు మిలియన్ ల sub sribers ను సంపాదించుకున్నాడు.. ఇది ప్రస్తుతం 10 మిలియన్ మార్క్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు హాం స్టార్ కోమ్బాట్ మునుపటి ఘనత ను అధిగమించాడు. హాం స్టార్ కోమ్బాట్ ఈ మైలు రాయి చేరుకోవడానికి వారం పట్టింది. ప్రస్తుతం రొనాల్డో 12 మిలియన్ సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. ” ఇది నా కుటుంబానికి లభించిన బహుమతి. SIUUU sub sribers కు ధన్యవాదాలు.. యూట్యూబ్ పంపించిన గోల్డెన్ బటన్ ను నా పిల్లలకు ఇస్తున్నాను. దానిని వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇకపై నా అభిమానులు నాకు సంబంధించిన విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు. నా ప్రయాణంలో భాగస్వాములు కావచ్చని” రొనాల్డో రాసుకొచ్చాడు.