Pavan Birthday wishesh to Megastar : మెగా బ్రదర్స్ మధ్య సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నదమ్ముల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ముగ్గురు అన్నదమ్ములు స్నేహితులుగా ఉంటారు. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ. ముఖ్యంగా చిరంజీవి అంటే ఇద్దరు తమ్ముళ్లకు భక్తి. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఇద్దరు తమ్ముళ్లు బయటపెట్టారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే అటు అన్నయ్య చిరంజీవి, ఇటు తమ్ముడు పవన్ కళ్యాణ్ పై వీరాభిమానం చూపుతుంటారు. అయితే చిరంజీవి సైతం తమ్ముళ్ళను చూసి మురిసిపోతుంటారు. ఇటీవల పవన్ రాజకీయంగా రాణించడంతో చాలా ఆనందపడ్డారు. కానీ స్వయంగా ప్రమాణస్వీకారానికి హాజరై ఆశీర్వదించారు. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అటు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈసారి పవన్ చిరంజీవి దాన గుణాన్ని కీర్తిస్తూ శుభాకాంక్షలు తెలపడం విశేషం. తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అంటూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రకటన మొదలుపెట్టారు. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు అన్నారు. ఆపద కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసని గుర్తు చేశారు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే.. ప్రపంచానికి తెలియని మరెన్నో సహాయాలు ఉన్న విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని.. అభ్యర్థిస్తారని పవన్ తెలిపారు. ఆ గుణమే ఆయనకు మెగాస్టార్ చేసిందని సగర్వంగా చెప్పారు పవన్.
* ఆ ఆశీర్వాద ఫలితమే విజయం
సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోయారు. అటు తరువాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయినా సరే ఏనాడు విసుగు చెందలేదు. అటు చిరంజీవి సైతం పవన్ పై ఎంతో నమ్మకం ఉంచారు. ఎన్నికలకు ముందు జనసేనకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించారు. తన తమ్ముడికి అండగా నిలవాలని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేసుకున్నారు పవన్. అన్నయ్య ఆశీర్వాదంతోనే తాను మంచి విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు.
* నైతిక మద్దతు మరువలేనిది
చిరంజీవి ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయని సగర్వంగా చెబుతున్నారు పవన్. అటువంటి గొప్పదాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి కూడా కృతజ్ఞుణ్ణి అని పవన్ అభివర్ణించారు. తల్లి లాంటి వదినమ్మతో ఆయన చిరాయిష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ముగించారు.
* ఈసారి స్పెషల్
ఇప్పటివరకు 68 పుట్టినరోజులు జరుపుకున్నారు చిరంజీవి.కానీ ఈ పుట్టినరోజు మాత్రం ఆయనకు స్పెషల్. తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అనుకున్నది సాధించారు. తన కుటుంబ ఇమేజ్ ను పెంచారు. అదే సమయంలో పవన్ సైతం చిరంజీవి పట్ల ఆరాధన భావాన్ని బయట పెట్టుకున్నారు. జనసేన సంపూర్ణ విజయం సాధించిన తర్వాత ఇంటికి వెళ్లి మరిఅన్నయ్యకు పాదాభివందనం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారం నాడు వేదికపై ప్రధాని మోదీ తో పాటు జాతీయ నాయకులు ఉన్నా.. వారి సమక్షంలోనే అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసి తనలో ఉన్న భావాన్ని చాటుకున్నారు. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాడు ఒక సందేశాత్మకమైన శుభాకాంక్షలతో తన ప్రేమను చాటుకున్నారు.