https://oktelugu.com/

ఒలింపిక్స్: లవ్లీనా బొర్గోహెన్ పంచ్ కు పతకం ఖాయం?

ప్రపంచ క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయం చేసింది 23 ఏళ్ల యువ లేడీ బాక్సార్ లవ్లీనా బొర్గోహెన్. ఒలింపిక్స్ ముందు కరోనా బారిన పడి అసలు కోలుకోకుండా శిక్షణకు దూరమైన ఈ లేడీ బాక్సర్ ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఒలింపిక్స్ బాక్సింట్ లో సంచలనం సృష్టించిన లవ్లీనా అరంగేట్రం పోటీల్లోనే భారత్ కు పతకాన్ని సాధించిపెట్టబోతుండడం దేశానికి గర్వకారణంగా మారింది. అస్సాంలోని గోలాఘాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2021 / 04:13 PM IST
    Follow us on

    ప్రపంచ క్రీడాసంబురం ఒలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయం చేసింది 23 ఏళ్ల యువ లేడీ బాక్సార్ లవ్లీనా బొర్గోహెన్. ఒలింపిక్స్ ముందు కరోనా బారిన పడి అసలు కోలుకోకుండా శిక్షణకు దూరమైన ఈ లేడీ బాక్సర్ ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ సెమీస్ లోకి అడుగుపెట్టింది.

    ఒలింపిక్స్ బాక్సింట్ లో సంచలనం సృష్టించిన లవ్లీనా అరంగేట్రం పోటీల్లోనే భారత్ కు పతకాన్ని సాధించిపెట్టబోతుండడం దేశానికి గర్వకారణంగా మారింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బరో ముఖియా అనే చిన్న గ్రామంలో 1997 అక్టోబర్ 2న లవ్లీనా జన్మించింది. ఈమె తండ్రి చిరు వ్యాపారి. ఈమె కంటే పెద్దవారైన ఇద్దరు అక్కలు కిక్ బాక్సింగ్ లో జాతీయ స్థాయిలో పోటీపడుతుంటారు. వారిని నుంచి బాక్సింగ్ నేర్చుకుంది. జిల్ల రాష్ట్ర స్థాయిలో పోటీచేసి ప్రతిభ నిరూపించుకుంది.

    ఈమె ప్రతిభను గుర్తించిన కోచ్ పదుమ్ బోరో ఆమెకు బాక్సింగ్ పరిచయం చేశాడు. 2012 నుంచి బాక్సింగ్ లో శిక్షణ పొందుతోంది. 2017లో జరిగిన ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం గెలుచుకోవడంతో లవ్లీనా పేరు తెరపైకి వచ్చింది. 2018లో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యపతకం సాధించి వెలుగులోకి వచ్చింది. రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ లో మళ్లీ కాంస్య పతకం సాధించింది.

    2020 మార్చిలో కరోనా పాజిటివ్వచ్చింది. దీంతో ఒలింపిక్స్ లో అర్హత సాధించిన ఆమెకు యూరప్ లో శిక్షణకు కూడా హాజరు కాలేకపోయింది. కరోనాతో లవ్లీనా ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆరోగ్యం సహకరించలేదు. అయినా కూడా ఎంతో కసరత్తులు చేసి ఒలింపిక్స్ కు వెళ్లి ఇప్పుడు భారత్ కు పతకం ఖాయం చసింది. అరంగేట్రంతోనే ఒలింపిక్స్ లో మాజీ ప్రపంచ చాంపియన్ చైనీస్ తైసీ బాక్సర్ నిన్ చిన్ తో తలపడి గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది.టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పథకాన్ని ఖాయం చేసింది.