https://oktelugu.com/

ముస్తాబు చేసి టికెట్ రేటు పెంచారు !

ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌ లో సినిమా చూడటం ఆనవాయితీ అయిపోయింది. హైదరాబాద్ ప్రజలకు ప్రసాద్స్ అంటే.. ఒక పర్యాటక స్థలం. అక్కడ సినిమా చూసి.. అటు నుండి కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారు చేసి.. ఇంటికి వెళ్లడం ఓ సరదా. హైదరాబాద్ ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సిటీకి వస్తే సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కచ్చితంగా ఉంటుంది. ప్రసాద్స్ కి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో […]

Written By:
  • admin
  • , Updated On : July 30, 2021 / 04:32 PM IST
    Follow us on

    ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌ లో సినిమా చూడటం ఆనవాయితీ అయిపోయింది. హైదరాబాద్ ప్రజలకు ప్రసాద్స్ అంటే.. ఒక పర్యాటక స్థలం. అక్కడ సినిమా చూసి.. అటు నుండి కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారు చేసి.. ఇంటికి వెళ్లడం ఓ సరదా. హైదరాబాద్ ప్రజలే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సిటీకి వస్తే సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కచ్చితంగా ఉంటుంది.

    ప్రసాద్స్ కి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో చక్కగా తీర్చిదిద్దుతూ సరికొత్తగా ముస్తాబు చేశారు. నేడు ప్రేక్షకులు ప్రసాద్స్ కి వెళ్లి అక్కడ హంగులు చూసి షాక్ అయ్యారు. ఎంతో అందంగా తయారైంది. ఎంతో బాగా రెన్నోవేషన్ చేశారు. ముఖ్యంగా కొత్త స్క్రీన్లు ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తున్నాయి.

    ప్రసాద్స్ లో మంచి వాతావరణం కల్పించడానికి, అలాగే సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు అన్ని విధాలుగా గుడ్ ఫీల్ ఇవ్వడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ ప్రసాద్స్ ను తీర్చిదిద్దింది. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే ఈ మల్టీప్లెక్స్ ను ఇలా తీర్చిదిద్దారట. పైగా కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా స్క్రీన్ల టెక్నాలజీని అప్‌డేట్ చేశారు.

    మరి, భారీగా ఖర్చు పెట్టి.. మల్టీప్లెక్స్ ను ఇలా తీర్చిదిద్దారు. అందుకే టికెట్ రేట్లు కూడా పెంచారు. 130 రూపాయిలు ఉంది టికెట్ ధర. మొత్తానికి జనానికి ఇదొక అదనపు భారం. ఇక త్వరలో ఐమాక్స్ తెరను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.