ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మైనింగ్ వ్యాపారం కొనసాగుతోంది. కొండపల్లి అడవుల్లో గ్రావెల్ మైనింగ్ పరిశీలనకు వెళ్లి అరెస్టయిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు ఇవాళ హైకోర్టులో ఊరట దక్కలేదు. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోరుతూ ఉమ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. బెయిల్ కోసం మాజీ మంత్రి దేవినేని ఉమ వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనాలు ప్రారంభించింది.
కేసులో ఉమను రిమాండ్ గా ఉంచాలనే భావనతో పోలీసులు కుట్ర పన్నారని ఉమ తరఫు న్యాయవాది ఆరోపించారు. స్టేషన్ రికార్డులు కోర్టుకు అందజేయలేదు. దీంతో విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీంతో ఉమ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 30 కిలోమీటర్ల దూరం నుంచి రికార్డులు తెప్పించాలని కోరినా ప్రయోజనం లేకుండా పోయింది.
కేసుల రికార్డులు పోలీస్ స్టేషన్ నుంచి తెప్పించాలన్న ఉమ తరఫు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు ఒప్పుకోలేదు.. ప్రభుత్వ వాదనకు సరేనన్న న్యాయస్థానం పిటిషన్ పై విచారణ ను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు కావడంతో సోమవారానికి వాయిదా వేయాల్సి ఉన్నా అప్పటికే విచారణకు వచ్చిన పిటిషన్లు ఉండడంతో మంగళవారం ఉమ బెయిల్ పై హైకోర్టు విచారణకు చేపట్టనుంది.