Odi World Cup 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈనెల 8వ తేదీన ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ మ్యాచ్ లో మన టీమ్ మొదటి మ్యాచ్ గెలవాలని ఇండియన్ అభిమానులందరూ వేచి చూస్తున్నారు.ఇక అందులో భాగంగానే మన ప్లేయర్లు చాలా కసరత్తులను కూడా మొదలుపెట్టారు. ఈ మ్యాచ్ కి శుభ్ మన్ గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం క్లారిటీగా తెలియదు కానీ ఆయన లేకపోయిన ఆయన ప్లేస్ లో ఇషాన్ కిషన్ ని తీసుకొని ఆయనతో ఓపెనింగ్ చేయిస్తారు. ఇక ఇంతకు ముందు ఆస్ట్రేలియా తో జరిగిన సీరీస్ లో ఆస్ట్రేలియాను చిత్తు గా ఓడించిన ఇండియా టీమ్ ఇప్పుడు మళ్లీ ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మనవాళ్లు సద్వినియోగపరుచుకొని ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ గెలిచి ఇండియా బోణీ కొట్టబోతుంది అని ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా మంచి ఉత్సాహం గా ఉన్నారు.
ఆస్ట్రేలియా టీం మీద రీసెంట్ గా ఆడిన సిరీస్ లో ఇండియన్ ప్లేయర్లు బాగా ఆడి 2-1 తేడాతో వాళ్ళని ఓడించడం జరిగింది.ఆ సీరీస్ లో ఆడినట్లుగానే ఈ మ్యాచ్ లో కూడా ఆడితే ఈ మ్యాచ్ ను మనం ఈజీగా గెలవచ్చు.కానీ ఆస్ట్రేలియన్ టీమ్ లోకి ఇప్పుడు చాలామంది ప్లేయర్లు అడిషనల్ గా ఆడ్ అయ్యారు దాంతో ఆస్ట్రేలియా టీమ్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది.ఈ సమయంలో మన ఇండియా టీమ్ ఆస్ట్రేలియా ని ఓదించాలి అంటే ఇంకా కొంచం ఎక్కువ కసరత్తులు చేయాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ ని అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వాళ్లు కూడా విజృంభించి ఆడి ఇండియా టీం ను చిత్తుగా ఓడించిన ఓడించొచ్చు. అందుకే మనవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటూ మ్యాచ్ ఆడితే బెటర్ అని ఇప్పటికే సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా మన టీమ్ కి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది…
ఇక ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మతో కలిసి మొదట ఓపెనింగ్ ప్లేయర్ గా వస్తాడు.ఇక ఇండియా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లో ఈ మ్యాచ్ ని ఓపెన్ చేయబోతుంది. దాని వల్ల ఇషాన్ కిషన్ మొదటి పది ఓవర్లలో చాలా రన్స్ చేసే ప్రయత్నమైతే చేస్తాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఈసారి వరుసగా విజయాలు అందుకుంటూ కెప్టెన్ గా విజయ ఢంకా మోగిస్తున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలవాలంటే తన బ్యాట్ నుంచి కూడా భారీ స్కోరు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఒక్కసారి రోహిత్ శర్మ గనక కరెక్ట్ గా స్టాండ్ అయి ఆడితే ఆయన ఎక్కువ రన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అలా రోహిత్ ఆడితే ఆయనని అపడం ఏ బౌలర్ వల్ల కాదు అనే విషయాలను మనం ఇప్పటికే చాలా సార్లు చూసాం…
ఇక ఒకసారి ఆస్ట్రేలియా తో ఆడే ఇండియన్ ప్లేయింగ్ 11 కనక చూసుకుంటే…
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కే ఎల్ రాహుల్,హార్దిక పాండ్య,రవీంద్ర జడేజా,అశ్విన్, కుల్దిప్ యాదవ్,మహమ్మద్ సూరజ్,జస్ప్రిత్ బుమ్రా లు ఆడే అవకాశం అయితే ఉంది…దాదాపు గా ఇండియా ఇదే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుంది…