Shubman Gill: వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో ఇండియా మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది. ఈ మ్యాచ్ విజయం కోసం రెండు జట్టు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇండియా టీం లో ఇప్పటికే అద్భుతమైన ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో అందుబాటు ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయనకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, సెలైన్స్ ఎక్కించడం లాంటివి చేస్తారు. అలాగే హెవీగా ఫీవర్ ఉంటుంది కాబట్టి ఆయన ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండకపోవచ్చు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఒకవేళ అతను ఫీవర్ నుంచి కోలుకున్న కూడా అంత పూర్తి ఫిట్నెస్ అయితే సాధించలేడు. ఎందుకంటే నీరసించి పోతాడు కాబట్టి మ్యాచ్ ఆడితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు అయిన రన్నింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అంత నీరసం గా ఉన్నవాడు మ్యాచ్ ఆడటం కష్టమే ఇక ఆయనకి కొంత రెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఆయన మొదటి మ్యాచ్ కి అందుబాటులో ఉండడు…
అయితే ఇక్కడ మంచి ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ అందుబాటులో లేకపోవడం అనేది ఒక వంతుకు ఇండియాకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గిల్ లాంటి ప్లేయర్ ఓపెనింగ్ లో వస్తే ఇండియాకి తెలియకుండానే ఒక మంచి స్కోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద జట్టు మీద మ్యాచ్ ఆడినప్పుడు కన్సిస్టెన్సీ తో ఆడే ప్లేయర్ ఉంటే చాలావరకు టీమ్ కి యూజ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అలా ఫీవర్ కి గురి కావడం కొంతవరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.
ఇక ఆస్ట్రేలియా మ్యాచ్ లో అందుబాటు లో లేకపోయినా పర్లేదు. కానీ తర్వాత ఆఫ్గనిస్తాన్ మీద ఒక మ్యాచ్, పాకిస్తాన్ మీద ఒక మ్యాచ్ అనేది వారం రోజుల వ్యవధిలోనే ఉండడం వాటికి అయిన ఆయన అందుబాటు లో ఉంటాడా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో గిల్ లేకపోవడం ఇండియాకి కొంతవరకు మైనస్ అవుతుందనే చెప్పాలి. ఆయన ప్లేస్ ని ఇషాన్ కిషన్ తో రీప్లేస్ చేసినప్పటికీ ఆయన ఎంతవరకు మ్యాచ్ ను నిలబెడతాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇలాంటి టైంలో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11 లో ఎవరెవరిని తీసుకుంటాడు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శుభ్ మన్ గిల్ లేకుండానే మనవాళ్లు కొన్ని మ్యాచ్ లు అయితే ఆడాల్సి వస్తుందని తెలుస్తుంది…