Odi World Cup 2023 Spinners: ప్రపంచ క్రికెట్ లో ఇక ఆఫ్ స్పిన్నర్ అనేవాళ్ళు కనిపించారా..?

మన ఇండియా టీంని చూసుకుంటే చైనామన్ స్పిన్నర్ గా పేరు పొందిన కుల్దీప్ యాదవ్ ని వరల్డ్ కప్ టీం లోకి సెలెక్ట్ చేయడం జరిగింది.

Written By: Gopi, Updated On : September 12, 2023 11:54 am

Odi World Cup 2023 Spinners

Follow us on

Odi World Cup 2023 Spinners: అప్పట్లో ప్రపంచ క్రికెట్ హిస్టరీ లోనే బ్యాట్స్ మేన్స్ కి ఎంతైతే గౌరవం ఉండేదో ఆఫ్ స్పిన్ వేసే బౌలర్లకు కూడా అంతే గౌరవం ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులను కనక చూసుకుంటే ఇప్పుడు ఆఫ్ స్పిన్ వేసే బౌలర్ర్లకి కాలం చెలిపోయిందనే చెప్పాలి ఎందుకంటే ప్రపంచ లో ఉన్న క్రికెట్ ప్లేయర్లు మొత్తం చాలా స్పీడ్ అయిపోయారు.ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ అయితే మరి చాలా స్పీడ్ అయిపోయారు టి 20 ఫార్మాట్ వల్ల వాళ్ళని పట్టుకోవడం కానీ, తట్టుకోవడం కానీ చాలా ఇబ్బంది గా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్లు వేసే బాల్స్ ని వాళ్ళు ఈజీగా ఎదురుకుంటున్నారు.ఆఫ్ స్పిన్నర్లు వికెట్లు తీయడం దేవుడెరుగు కనీసం బాల్స్ డాట్ చేయడం లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే అన్ని దేశాల టీములు కూడా ఆఫ్ స్పిన్నర్లని పక్కన పెట్టేశాయి దీనికి ఉదాహరణ గా రీసెంట్ గా అన్ని జట్లు వాళ్ల వరల్డ్ కప్ టీం లని అనౌన్స్ చేసాయి అందులో ఒక్క దేశం తరుపున కూడా ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆఫ్ స్పిన్నర్ల పరిస్థితి ఎలా ఉందనేది మొత్తం లెగ్ స్పిన్నర్లు అలాగే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లకు ఎక్కువ అవకాశాలని ఇస్తున్నారు.

మన ఇండియా టీంని చూసుకుంటే చైనామన్ స్పిన్నర్ గా పేరు పొందిన కుల్దీప్ యాదవ్ ని వరల్డ్ కప్ టీం లోకి సెలెక్ట్ చేయడం జరిగింది.అలాగే లెగ్ స్పిన్నర్ల విభాగం లో అక్షర్ పటేల్,రవీంద్ర జడేజా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు.ఇక మన ఇండియా టీం లో టాప్ బౌలర్ గా గుర్తింపు పొందిన రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్ ని సెలెక్ట్ చేయలేదు కారణం ఆయన ఆఫ్ స్పిన్ వేసే బౌలర్ కాబట్టి…ఇక ప్రతి టీం లో ఎవరో ఒకరు బ్యాట్స్మెన్స్ అటు బ్యాటింగ్ చేస్తూ ఇటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలిగేవారు ఉంటున్నారు కాబట్టి ఇక సపరేట్ గా స్పిన్నర్ అవసరం లేకుండా పోయింది…

ఇక ఇంగ్లాండ్ లాంటి దేశం లో కూడా అదిల్ రషీద్ లాంటి మణికట్టు బౌలర్ ని సెలెక్ట్ చేయడం జరిగింది.అందుకే వాళ్ళు ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇక దానికి తోడు ఆ టీం లో బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్లు అయినా మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ లు కూడా ఆఫ్ స్పిన్ వేసే బౌలర్లు కావడం తో ఆఫ్ స్పిన్ కోసం ప్రత్యేకంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లని తీసుకోకుండా వాళ్ల ప్లేస్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు…

ఇక ఆస్ట్రేలియా లాంటి టీం లో కూడా ఆడమ్ జంపా, ఆస్టన్ అగర లాంటి స్పిన్నర్లు ఉండటం వీళ్ళుకూడా లెగ్ స్పిన్ వేస్తూ బ్యాట్స్మెన్స్ ని ఇబ్బంది పెట్టగలరు. ఇక వాళ్ళకి తోడు గా మ్యాక్స్ వెల్ లాంటి ఒక అత్యుత్తమైన బౌలర్ ఉండటం కూడా ఆ టీం కి చాలా వరకు కలిసి వచ్చే అంశం…మ్యాక్స్ వెల్ ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి ఇక వీళ్ళకి ఆఫ్ స్పిన్నర్ అవసరం లేడు.ఇక మరో పెద్ద జట్టు అయినా సౌత్ ఆఫ్రికా లో కూడా షంషీ చైనామన్ బౌలర్ కావడం ఇక కేశవ్ మహారాజ్ ఎడమ చేతివాటం స్పిన్నర్లు కావడం వల్ల వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది.ఇక పాకిస్థాన్ లో షాదాబ్ ఖాన్ లెగ్ స్పిన్నర్ ఇక వాళ్ల టీం లో ఉన్న మరో స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ ది ఎడమ చేతి వాటం కావడం తో ఆయాన్ని సెలెక్ట్ చేసారు ఇక న్యూజిలాండ్ టీం లో ఉన్న స్పిన్నర్లు అయినా శంట్నర్ గాని రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు కూడా ఎడమ చేతివాటం బౌలర్లు…

అయితే ఒకప్పుడు చాలా వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ అలాగే మన ఇండియన్ గ్రేట్ స్పిన్నర్ అయినా హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లు కూడా హాఫ్ స్పిన్నర్లే కావడం మనం గతం లో చూసాం కానీ ఇప్పుడు మాత్రం బావింగ్ లో చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. ఇక ఇలాగె ఉంటె ఫ్యూచర్ లో ఆఫ్ స్పిన్నర్ అనే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా పోతాడేమో…ఒకప్పుడు ఇండియా మ్యాచులు ఆడితే అందులో ఆఫ్ స్పిన్నర్ గా హర్భజన్ సింగ్, లెగ్ స్పిన్నర్ గా అనిల్ కుంబ్లే ఉండేవారు…కానీ ఇప్పుడు ఆ రోజులు లేకుండా పోయాయి…