Janasena-TDP-BJP : ఆంధ్రాలో ఇవ్వాళ రెండు అంశాలపై టీవీల్లో.. సోషల్ మీడియాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ క్లీన్ రికార్డ్ కలిగి ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. రెండోది బీజేపీ బంద్ నకు మద్దతు తెలుపకపోవడం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని అంటున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రధాన ప్రశ్న. జనసైనికుల్లోనూ ఇది ఉంది. పవన్ కళ్యాణ్ ఏమోషన్స్ తో చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు. రాజకీయాల్లో ఎమోషన్స్ ఉండవు.. వ్యూహాలే ఉంటాయి. పవన్ ఒకనాటి ఆవేశపరుడు కాదు. పవన్ మెచ్చూర్డ్ పాలిటీషియన్. కాబట్టి ఏదీ చేసినా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది.
చంద్రబాబుతో అనుబంధం ఉండబట్టే మద్దతు అన్నది అవాస్తవం. ఆయన ఎందుకు ఈ వ్యూహం తీసుకుంటున్నాడన్నది ఆలోచిస్తే.. ‘వైసీపీ విమోచనం’ కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏ చర్య తీసుకున్నా ఆ వ్యూహానికి అనుగుణంగానే ఉంటుంది. వైసీపీతో ఒంటరిగా వెళ్లి ఎదుర్కోవచ్చు కదా? అని ప్రశ్నించొచ్చు.
కానీ జనసేనకు ప్రధాన లోపం ఆర్థిక వనరులు తక్కువ. పవన్ తను సినిమాలు తీస్తూ పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ అంత ధనబలం.. నాయకత్వ బలం లేదు.
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మద్దతుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.