West Indies Vs Netherlands: పసికూన పవర్ ఫుల్ విండీస్ నే ఓడించింది.. సూపర్ ఓవర్ లో అద్భుతమే చేసింది..

48 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 345 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాలి. ఈ దశలో వెస్టిండీస్ జట్టు సులభంగా విజయం సాధిస్తుందనిపించింది.

Written By: BS, Updated On : June 27, 2023 8:14 am

West Indies Vs Netherlands

Follow us on

West Indies Vs Netherlands: భారతి వేదికగా అక్టోబర్ నెలలో జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు నేరుగా అర్హత సాధించిన జట్లకు క్వాలిఫైయర్ మ్యాచ్ లు ద్వారా ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యాచ్లో జరుగుతున్నాయి. సోమవారం రాత్రి వెస్టిండీస్, నెదర్లాండ్స్ జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ చెట్టుకు నెదర్లాండ్స్ జట్టు షాక్ ఇచ్చింది. తొలిత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ చెట్టు ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసినప్పటికీ.. జట్టు నిర్ణీత ఓవర్లలో స్కోరును సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. సూపర్ ఓవర్ లో నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించి వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది.

వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. సోమవారం రాత్రి నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణమైన రీతిలో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించడం ఇబ్బందిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రశ్రేణి జట్లు మాదిరిగా ఇరు జట్లు సోమవారం జరిగిన మ్యాచ్ లో హోరాహోరీగా తలపడ్డాయి. 374 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ వెస్టిండీస్ బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్స్ జట్టు కూడా అదే పరుగులు చేసి మ్యాచ్ ను టై చేసింది. దీంతో సూపర్ ఓవర్ కు వెళ్ళగా.. నెదర్లాండ్స్ జట్టు అనుహ్య రీతిలో విజయాన్ని సాధించింది.

అదరగొట్టిన నికోలస్ పూరన్.. భారీగా పరుగులు..

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు రాణించడంతో తొలి వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఓపెనర్లలో బ్రాండన్ కింగ్ 81 బంతుల్లో 76 పరుగులు, చార్లెస్ 55 బంతుల్లో 54 పరుగులు చేశారు. ఆ తరువాత వచ్చిన బ్రూక్స్ 31 బంతుల్లో 25 పరుగులు చేశాడు. సాయి హోప్ కూడా రాణించాడు. 38 బంతుల్లో 47 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 65 బంతుల్లో 104 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోరు దిశగా సాగింది. చివరలో వచ్చిన కీమో పాల్ 25 బంతుల్లో 46 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లీడే, సాకిబ్ జుల్ ఫిఖర్ రెండేసి వికెట్లు తీసుకోగా, బీక్, కంగ్మా ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ధీటుగా ఆడిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు..

పారి లక్ష్మీ అయినప్పటికీ నెదర్లాండ్స్ జట్టు ఆటగాళ్లు ఏమాత్రం భయపడలేదు. పసికూనలే అయినప్పటికీ శ్రేణి ఆటగాళ్లు మాదిరిగా రెచ్చిపోయారు. వచ్చిన ప్రతి బ్యాటర్ పరుగులు చేయడంతో విజయం దిశగా సాగింది నెదర్లాండ్స్ జట్టు. నెదర్లాండ్స్ ఓపెనర్లు కూడా జట్టుకు అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. విక్రమ్ జీత్ సింగ్ 32 బంతుల్లో 37 పరుగులు, మ్యాక్స్ దావుద్ 36 బంతుల్లో 36 పరుగులు చేయడంతో తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం లభించింది. తర్వాత వచ్చిన వెస్లీ బార్రేసే 34 బంతుల్లో 27 పరుగులు, లీడే 47 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన తేజ నిదమానూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు సిక్సులు, 11 ఫోర్ల సహాయంతో 76 బంతుల్లో 111 పరుగులు చేసి నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వచ్చిన స్కాట్ ఎడ్వర్డ్స్ 47 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. అలాగే లాగాన్ వాన్ బీక్ 14 బంతుల్లో 28 పరుగులు, ఆర్యన్ దత్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టును విజయానికి ఒక్క అడుగు దూరంలో తెచ్చి నిలిపేశారు.

రెండు ఓవర్లలో విజయానికి 30 పరుగులు..

48 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 345 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాలి. ఈ దశలో వెస్టిండీస్ జట్టు సులభంగా విజయం సాధిస్తుందనిపించింది. 49వ వార్ బౌలింగ్ చేసిన చేజ్ 21 పరుగులు సమర్పించుకోవడంతో చివరి ఓవర్లో నెదర్లాండ్స్ విజయానికి 9 పరుగుల అవసరమయ్యాయి. సులభంగా నెదర్లాండ్స్ జట్టు విజయం సాధిస్తుందని పించింది. అప్పటికే మంచి స్పీడ్ మీద ఉన్న ఆర్యన్ దత్, వాన్ బీక్ క్రీజీ లో ఉన్నారు. ఫైనల్ ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చిన అల్జారి జోసఫ్ వేసిన తొలి బంతిని బీక్ ఫోర్ గా మలచడంతో విజయం పూర్తిగా నెదర్లాండ్స్ వైపు మళ్ళింది. ఆ తర్వాత బంతికి బీక్ సింగల్ తీయగా, మూడో బంతికి ఆర్యన్ దత్ క్యాచ్ అవుట్ గా వెను దిరిగాడు. ఈ దశలో మూడు బంతుల్లో నెదర్లాండ్స్ జట్టు విజయానికి మూడు పరుగులు కావాలి. నాలుగో బంతిని ఫ్లైద్ సింగిల్ తీశాడు. దీంతో చివరి రెండు బంతుల్లో నెదర్లాండ్స్ విజయానికి మూడు పరుగులు కావాల్సి వచ్చింది. ఐదో బంతికి బీక్ రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ డ్రా అయింది. చివరి బంతికి సింగిల్ తీస్తే నెదర్లాండ్స్ జట్టు విజయం సాధిస్తుంది. అయితే చివరి బంతికి బీక్ క్యాచ్ అవుట్ కావడంతో మ్యాచ్ డ్రా అయింది.

30 పరుగుల సమర్పించుకున్న హోల్డర్..

మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్ళింది. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన బీక్, ఎడ్వర్డ్స్ బరిలోకి దిగారు. బౌలింగ్ వేసేందుకు హోల్డర్ రాగా.. ఊర మాస్ లెవెల్లో బీక్ ఊచకూత కోశాడు. తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్స్, మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సిక్స్, ఐదో బంతికి సిక్స్, ఆరో బంతికి ఫోర్ కొట్టడంతో.. మొత్తంగా 30 పరుగులను రాబట్టుకున్నాడు వాన్ బీక్. 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఎనిమిది పరుగులు మాత్రమే చేయడంతో 23 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. తొలి బంతిని బీక్ బౌలింగ్లో సిక్స్ బాదిన చార్లెస్, ఆ తరువాత బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి హోప్ సింగిల్ తీయగా, నాలుగో బంతికి చార్లెస్, ఐదో బంతికి హోల్డర్ అవుట్ కావడంతో మ్యాచ్ ముగిసి.. నెదర్లాండ్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.