https://oktelugu.com/

Odi World Cup 2023: ఇదేం క్రికెట్.. బౌలర్లను తొక్కేస్తున్న బ్యాట్స్ మెన్స్…

హాఫ్ సెంచరీ, సెంచరీలు చేస్తూ తమదైన రీతిలో ప్రతిభని చాటుతూ ఉంటారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఒక్కో బాల్ ఒక్కో రకం గా వేస్తూ ప్రతి బాల్ కి వేరియేషన్స్ ని చూపిస్తూ ఆడుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2023 / 08:46 AM IST

    Odi World Cup 2023

    Follow us on

    Odi World Cup 2023: ప్రస్తుతం చాలామంది ప్లేయర్లు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు.అదే విధంగా ప్రతి మ్యాచ్ లో జనాలందర్నీ ఆకర్షిస్తుంటారు. ఇలాంటి క్రమంలో ప్రతి బ్యాట్స్ మెన్ కూడా తమదైన రీతిలో సెంచరీ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి మ్యాచ్ లో కూడా తన పూర్తి ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇలాంటి క్రమంలో బ్యాట్స్ మెన్స్ అందరూ తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

    అయితే హాఫ్ సెంచరీ, సెంచరీలు చేస్తూ తమదైన రీతిలో ప్రతిభని చాటుతూ ఉంటారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఒక్కో బాల్ ఒక్కో రకం గా వేస్తూ ప్రతి బాల్ కి వేరియేషన్స్ ని చూపిస్తూ ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలో తమదైన రీతిలో ఒక మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి టీమ్ కి మంచి విజయాలను అందిస్తున్నప్పటికీ ఎందుకు వాళ్ళు బ్యాట్స్ మెన్స్ తో పోల్చుకుంటే వెనుకబడి పోతున్నారు అనే విషయం అర్థం కావడం లేదు.ఒక మ్యాచ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి ప్లేయర్లు హాఫ్ సెంచరీ, సెంచరీలు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కానీ ఒక మ్యాచ్ లో ఒక నాలుగు, ఐదు వికెట్లు తీసిన కూడా మనం బౌలర్ల గురించి ఎక్కువ గా పట్టించుకోము.

    ఇది ఇప్పుడు అనే కాదు ఇంతకుముందు రోజుల్లో కూడా అలాగే జరిగేది ఇండియన్ టీమ్ తరఫున అనిల్ కుంబ్లే 950 కి పైన వికెట్లు తీశాడు. అయినప్పటికీ మనకు ఇండియన్ టీం అంటే సచిన్ టెండూల్కర్ ,ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ వీళ్ళే గుర్తొస్తారు తప్ప వేరే వాళ్ళు ఎవరు గుర్తుకు రారు అసలు ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇంక అనిల్ కుంబ్లే అనే బౌలర్ ఉన్నాడా లేడా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు బౌలర్లు వెనుకబడి పోతున్నారనేది తెలియడం లేదు.మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఇదే పరిస్థితి నడుస్తుంది. బ్యాట్స్ మెన్స్ కు ఉన్న క్రేజ్ బౌలర్ కి ఉండడం లేదు.

    ఆస్ట్రేలియా టీమ్ అంటే అందరు ముందుగా రికీ పాంటింగ్ , ఆడమ్ గిల్ క్రిస్ట్ లాంటి వాళ్ళ పేర్లు చెప్తారు తప్ప ఆస్ట్రేలియా టీం తరఫున అత్యధిక వికెట్లు తీసిన షేన్ వార్న్ గురించి గానీ,గ్లెన్ మెగ్రత్ గురించి గానీ, బ్రెట్లీ గురించి గానీ ఎవరు చెప్పరు. అందరి దృష్టిలో బ్యాట్స్ మెన్ ఒక్కడే హీరో…బౌలర్లు ఎందుకు పనికిరారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు.కానీ బౌలర్లు లేకపోతే టీం విజయం సాధించదు అనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఏ బౌలర్ కి కూడా సరైన గుర్తింపు ఉండడం లేదు ప్రతి దేశంలో ఉన్న బౌలర్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఒక బ్యాట్స్ మెన్ సెంచరీ చేసినప్పటికీ బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని అవుట్ చేయకపోతే ఆ టీం విజయం సాధించదు ఒక మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన కానీ ఆ బౌలర్లు ఇంకా వెనుకబడి ఉన్నారనే అసంతృప్తి మాత్రం ప్రతి బౌలర్ లో నెలకొంది. మరి దీనికి అంతటికి కారణం అభిమానుల లేక బౌలర్లుగా మారడం ఆ ప్లేయర్లు చేసుకున్న దురదృష్టమా అనేది ఎవరికి తెలియడం లేదు…