https://oktelugu.com/

Mathews Timed Out: మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ విషయంలో షఖిబుల్ హాసన్ చేసింది తప్పా..? ఒప్పా..?

టైమర్ లో ఇచ్చిన టైం ప్రకారం బ్యాట్స్ మెన్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాట్స్ మెన్ క్రీజ్ లోకి మూడు నిమిషాలు లోపు రావాలి వచ్చి బ్యాటింగ్ చేయడానికి రెడీ గా ఉండాలి లేదా తను నాన్ స్ట్రైకర్ లో ఉండి ఇంకో ప్లేయర్ స్ట్రైక్ లో అయిన ఉండాలి.

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2023 8:37 am
    Mathews Timed Out

    Mathews Timed Out

    Follow us on

    Mathews Timed Out: వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ కి వెళ్లే రేసు లో ప్రతి టీం కూడా తమదైన రీతిలో మ్యాచులను ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి… ఇక ఇలాంటి క్రమంలో ఇండియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కి క్వాలిఫై అవ్వగా శ్రీలంక ,బంగ్లాదేశ్ , ఇంగ్లాండ్ టీంలు ఇప్పటికే ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయిపోయాయి. ఇక నిన్న బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మీద బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఆ మ్యాచ్ లో శ్రీలంక ప్లేయర్ అయిన మాథ్యూస్ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన షకీబుల్ హాసన్ చేసింది తప్పు అని చాలామంది అంటున్నారు. ఎందుకు అంటే మాథ్యూస్ క్రీజ్ లోకి వచ్చి ఒక్క బాల్ కూడా ఆడకుండా టైమ్డ్ ఔట్ కింద ఔట్ అయి మళ్ళీ పెవిలియన్ కి అంటే వెనక్కి వెళ్ళిపోయాడు.

    అయితే ఆయన అలా ఎందుకు వెళ్లి పోవాల్సి వచ్చిందంటే ఎంసిసి (మేరిల్బోన్ క్రికెట్ క్లబ్) రూల్ ప్రకారం ఒక వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చే ప్లేయర్ 3 మినిట్స్ లోపు క్రీజ్ లోకి వచ్చి గాడ్ తీసుకొని బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ 3 మినిట్స్ కంటే లేట్ అయితే మాత్రం అతన్ని టైమ్డ్ అవుట్ కింద అవుట్ చేసి తిరిగి పెవిలియన్ పంపించే అధికారం ఆపోజిట్ టీం కెప్టెన్ కి ఉంటుంది… అయితే ఈ టైమింగ్ అనేది ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారు అనే ఒక డౌట్ మనలో అందరికీ వస్తుంది. నిజానికి ఈ టైం అనేది గ్రౌండ్ లో వికెట్ కోల్పోయిన తర్వాత థర్డ్ ఎంపైర్ దగ్గర ఉన్న ఒక టైమర్ అనేది ఆన్ అవుతుంది.

    ఆ టైమర్ లో ఇచ్చిన టైం ప్రకారం బ్యాట్స్ మెన్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాట్స్ మెన్ క్రీజ్ లోకి మూడు నిమిషాలు లోపు రావాలి వచ్చి బ్యాటింగ్ చేయడానికి రెడీ గా ఉండాలి లేదా తను నాన్ స్ట్రైకర్ లో ఉండి ఇంకో ప్లేయర్ స్ట్రైక్ లో అయిన ఉండాలి. లేకపోతే థర్డ్ ఎంపైర్ నుంచి ఫీల్డ్ ఎంపైర్ కి ప్లేయర్ లేటుగా వచ్చినట్టుగా ఒక చిన్న మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఇక అలాంటి టైం లో బౌలింగ్ టీం కెప్టెన్ గనక అప్పీల్ చేసినట్లయితే ఫీల్డ్ ఎంపైర్ ఆ ప్లేయర్ ని టైమ్డ్ ఔట్ కింద ఔట్ చేసి బయటికి పంపిస్తాడు. అయితే ఈ టైం అనేది ఎంసిసి రూల్స్ ప్రకారం 3 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ వరల్డ్ కప్ లో మాత్రం దీనిని 2 నిమిషాలకే కుదించారు. దాంతో మాథ్యూస్ క్రీజ్ లోకి వచ్చి 2 నిమిషాల లోపు తన గాడ్ అనేది తీసుకోకుండా హెల్మెట్ తాడు తెగిపోయింది అని వాళ్ల ప్లేయర్లకి సైగ చేయడం చేశాడు కానీ ఫీల్డ్ ఎంపైర్ తో ఏం చెప్పకపోవడం తో షఖిబుల్ హాసన్ అప్పీల్ చేస్తే ఫీల్డ్ ఎంపైర్ అతన్ని ఔట్ చేశాడు…

    కానీ అప్పుడు మాథ్యూస్ ఫీల్డ్ ఎంపైర్ ని అడిగితే కెప్టెన్ కి ఇబ్బంది లేకపోతే నాకు ఏ ఇబ్బంది లేదని ఎంపైర్ అనడంతో మాథ్యూస్ వెళ్లి షఖిబుల్ హాసన్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయిన కూడా షకీబుల్ హాసన్ నేను నీతో ఏం మాట్లాడను ఎంపైర్ తో మాట్లాడతాను అని ఎంపైర్ తో మాట్లాడి మాథ్యూస్ ని అవుట్ చేయించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది షకిబుల్ హసన్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ని చూపించలేకపోయాడు అని చాలా మంది ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మన మాజీ ప్లేయర్ అయిన మహమ్మద్ కైఫ్ కూడా షకిబుల్ హసన్ నువ్వు చేసింది తప్పు అంటూ కామెంట్స్ చేశాడు, అలాగే సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా నేను కెప్టెన్ అయి ఉంటే అలా చేసే వాడిని కాదు అని కామెంట్ చేశాడు కానీ కామెంటేటర్ గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ గాని, రమిజ్ రాజా గాని ఇద్దరు కూడా ఈ ప్రాసెస్ లో మాథ్యూస్ ది కూడా తప్పు ఉంది అని అన్నారు.

    ఎందుకంటే ఒక జూనియర్ ప్లేయర్ అయితే ఏదైనా తెలియకుండా చేశాడేమో అనుకొవ్వచ్చు, కానీ తను మాథ్యూస్ చాలా సీనియర్ ప్లేయర్ ఆయన ఇలా నిర్లక్ష్యం గా ఉండటం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.అయితే వాస్తవానికి అక్కడ జరిగిన సిచువేషన్ ఏంటి అంటే వికెట్ కోల్పోయినప్పుడు మాథ్యూస్ ఎక్కడో పెవిలియన్ పైన కూర్చొని ఉన్నాడు. తను క్రీజ్ లోకి కాదు గ్రౌండ్ లోకి వచ్చేసరికే 2 మినిట్స్ అయిపోయింది. ఆయన హెల్మెట్ తాడు తెగిపోయి ఉండడంవల్ల తను హెల్మెట్ కోసం వల్ల ప్లేయర్ ను పిలిచాడు ఇక ఇదే క్రమం లో బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన షఖిబుల్ ఎంపైర్ కి అప్పీల్ చేశాడు.ఎంపైర్ ఔట్ ఇచ్చేశాడు.దాంతో మాథ్యూస్ ఒక ఎక్స్ ప్లేనేశన్ ఇస్తున్నాడు కానీ ఆ హెల్మెట్ వల్ల లేట్ అవ్వలేదు.

    ఆయన క్రీజ్ లోకి వచ్చే సరికే నాలుగు నిమిషాలు దాటిందని కామెంటేటర్ చేస్తున్న సంజయ్ మంజ్రేకర్ తెలియజేశాడు. అంటే ప్లేయర్ క్రీజ్ లోకి వచ్చేసరికి ఆల్రెడీ టైం అవుట్ అయిపోయింది.గాడ్ తీసుకుని మ్యాచ్ స్టార్ట్ చేసేదాకా వెయిట్ చేసి అప్పిల్ చేయడం జరిగింది. దాంతో ఎంపైర్ ఔట్ ఇచ్చాడు.అయితే షకిబుల్ హసన్ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రస్తుతం వాళ్ళు స్లో ఓవర్ రేటింగ్ కింద మ్యాచ్ లు ఆడుతున్నారు అలాగే ఛాంపియన్ ట్రోఫీకి వాళ్ళు ఇంకా క్వాలిఫై అవ్వాలంటే మ్యాచులు గెలవాల్సి ఉంది.కాబట్టి కెప్టెన్ షకిబుల్ హాసన్ మీద బాధ్యత ఉంది.

    కాబట్టి నిర్లక్ష్యం గా ఆడిన ఒక ప్లేయర్ ని అవుట్ చేయడం తప్పు కాదు అని తను భావించి మాథ్యూస్ ని పెవిలియన్ కి పంపించాడు.నిజానికి షకిబుల్ హాసన్ చేసింది పెద్ద తప్పేమీ కాదు. ఎందుకంటే స్లో ఓవర్ రేటింగ్ వల్ల కెప్టెన్ మీద పెనాల్టీ విధించడం జరుగుతుంది.అలాగే బౌలర్లు ఒక్క నిమిషం లేట్ అయినందుకే కెప్టెన్లకి గాని, బౌలర్లకు గాని పెనాల్టీ వేస్తారు.మరి ఇలాంటి టైం లో బ్యాట్ మెన్స్ కి ఎందుకు ఇలాంటి వాటిని అమలు చేయకూడదు తప్పు వాళ్ళు చేసిన తప్పే అవుతుంది కదా అందుకోసమనే మాథ్యూస్ మీద కూడా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు…